ఐపీఎల్‌- 2023 14వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings), సన్‌రైజర్స్(Sunrisers Hyderabad) జ‌ట్ల‌ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ మొద‌ట‌ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 143 పరుగుల లక్ష్యాన్ని విధించింది. స్వల్ప లక్ష్యాన్ని హైదరాబాద్ సునాయాసంగా చేధించింది. సన్‌రైజర్స్ ఓపెన‌ర్ హ్యారీ బ్రూక్ కేవలం 13 పరుగులకే ఔటయ్యాడు. […]

ఐపీఎల్‌- 2023 14వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings), సన్‌రైజర్స్(Sunrisers Hyderabad) జ‌ట్ల‌ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ మొద‌ట‌ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 143 పరుగుల లక్ష్యాన్ని విధించింది. స్వల్ప లక్ష్యాన్ని హైదరాబాద్ సునాయాసంగా చేధించింది. సన్‌రైజర్స్ ఓపెన‌ర్ హ్యారీ బ్రూక్ కేవలం 13 పరుగులకే ఔటయ్యాడు. రాహుల్ త్రిపాఠి(Rahul Tripathi), కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్(Aiden Markram) బాగ‌స్వామ్యం జ‌ట్టు విజ‌యానికి తోడ్ప‌డింది. రాహుల్ 48 బంతుల్లో 74 పరుగులు చేశాడు. మార్క్రామ్ 37 పరుగులతో ప‌ర్వాలేద‌నిపించాడు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన‌ పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు ఆరంభంలో భారీ షాక్ త‌గిలింది. ఓపెనర్ ప్రభసిమ్రాన్ సింగ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. మాట్ షార్ట్, జితేష్ శర్మ కూడా విఫ‌ల‌మ‌య్యారు.. సామ్ కరణ్ 22 పరుగులు చేశాడు. సికందర్ రజా, షారుక్ ఖాన్, హర్ ప్రీత్ బ్రార్, మోహిత్ రాఠీ ఇలా అంద‌రూ విఫ‌ల‌మ‌య్యారు. శిఖర్ ధావన్ ఒక్క‌డే తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ధావన్ 66 బంతుల్లో 99 పరుగులు చేయ‌డంతో పంజాబ్ కింగ్స్ గౌరవప్రదమైన స్కోరును చేరుకోగలిగింది.

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్ల‌ మధ్య ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు జరగగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్‌లు గెలిచింది. పంజాబ్ కింగ్స్ జట్టు 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇదే తొలి విజయం. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 72 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌కి ఇదే తొలి ఓటమి.

Updated On 9 April 2023 11:42 PM GMT
Yagnik

Yagnik

Next Story