Sunrisers Hyderabad : తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్..! కావ్య పాప ఆనందానికి అవధుల్లేవు..!
ఈ ఐపీఎల్ సీజన్‌లో తన ప్రారంభమ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad)అదరగొట్టింది.

ఈ ఐపీఎల్ సీజన్‌లో తన ప్రారంభమ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad)అదరగొట్టింది. బ్యాటింగ్‌లో గత సీజన్‌లో లాగే దూకుడు మీద ఉన్న జట్టు తొలి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్(Rajasthan Royals)ను 44 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. కొత్తగా జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్(Ishan Kishan) ఆకశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాజస్తాన్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 47 బంతుల్లో ఆరు సిక్స్‌లు, 11 ఫోర్లతో 106 పరుగులు చేశాడు. మరో డైనమైట్ ట్రవిస్ హెడ్(travis head)31 బంతుల్లో 67 పరుగులతో విరుచకుపడ్డారు. ఇక హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen)క్రీజులో కొద్ది సేపయినా ధనాధన్ ఇన్నింగ్స్ 14 బంతుల్లో 34 పరుగులతో దుమ్ములేపాడు. ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి రికార్డు స్థాయిలో 286 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో రాజస్తాన్ 242 పరుగులకే పరిమితం కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఈ సందర్బంగా కెప్టెన్ కమిన్స్(Pat Cummins) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు బ్యాటర్లకు తాను పొరపాటున కూడా బౌలింగ్ వేయబోనని సరదాగా వ్యాఖ్యానించాడు. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ నమ్మశక్యంగా కాని బ్యాటింగన్నాడు. తమ బ్యాటర్లను ఎంత పొడిగినా తక్కునేనని.. ప్రాక్టీస్‌లో చాలా కష్టపడ్డారన్నారు.
