ఐపీఎల్‌-2023లో 40వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 9 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టుపై విజయం సాధించింది. టోర్నీలో స‌గానికి పైగా మ్యాచ్‌లు అయిపోయిన నేప‌థ్యంలో ప్లే ఆప్ కు చేరాలంటే ప్ర‌తీ మ్యాచ్ నెగ్గాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు, బ్యాట్స్‌మెన్ అద్భుత ఆటతీరును ప్రదర్శించారు.

ఐపీఎల్‌-2023లో 40వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్(Hyderabad) 9 పరుగుల తేడాతో ఢిల్లీ(Delhi) జట్టుపై విజయం సాధించింది. టోర్నీలో స‌గానికి పైగా మ్యాచ్‌లు అయిపోయిన నేప‌థ్యంలో ప్లే ఆప్ కు చేరాలంటే ప్ర‌తీ మ్యాచ్ నెగ్గాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు, బ్యాట్స్‌మెన్ అద్భుత ఆటతీరును ప్రదర్శించారు. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 198 పరుగులు చేసింది.

భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం లభించలేదు. కెప్టెన్ డేవిడ్ వార్నర్(David Warner) ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టగా.. ఆ తర్వాత ఫిల్ సాల్ట్(Philip Salt), మిచెల్ మార్ష్(Mitchell Marsh) లు చెలరేగి బ్యాటింగ్ చేశారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఆడుతున్నప్పుడు ఢిల్లీ విజయం ఖాయం అనిపించింది, అయితే మార్ష్ ఔట్ అయిన వెంటనే ఢిల్లీ బ్యాటింగ్ కుప్ప‌కూలింది. సాల్ట్ 59, మార్ష్ 63 పరుగులు చేశారు. మనీష్ పాండే(Manish Pandey) కేవ‌లం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియ‌న్ చేరాడు. ప్రియమ్ గార్గ్(Priyam Garg) 12, సర్ఫరాజ్ ఖాన్(Sarfaraj Khan) 9 విఫ‌ల‌మ‌య్యారు. ఆఖర్లో అక్షర్ పటేల్(Axar Patel)(29) భారీ స్ట్రోక్స్ కొట్టే ప్రయత్నం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున భువనేశ్వర్ కుమార్(Bhuvaneshwar Kumar), అకిల్ హుస్సేన్, టి నటరాజన్, అభిషేక్ శర్మ త‌లా ఒక‌ వికెట్ చొప్పున తీశారు. మయాంక్ మార్కండే 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

అంత‌కుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే షాక్ త‌గిలింది. మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రాహుల్ త్రిపాఠి(Rahul Tripati) 10 పరుగులు చేశాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ 8 పరుగులు మాత్రమే చేశాడు, అయితే ఓపెనర్ అభిషేక్ శర్మ 36 బంతుల్లో 67 ప‌రుగులు (12 ఫోర్లు, 1 లాంగ్ సిక్స్‌)తో రాణించాడు. ఆఖర్లో హెన్రిచ్ క్లాసెన్ 27 బంతుల్లో 53 పరుగులు చేశాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో మిచెల్ మార్ష్ 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Updated On 29 April 2023 8:49 PM GMT
Yagnik

Yagnik

Next Story