ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నై చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలవడం.. రోహిత్ శర్మ మరోసారి డకౌట్ కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫామ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ముంబై ఇండియన్స్(Mumbai Indians) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పేలవ ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్(Suneel Gavaskar) సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నై చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలవడం.. రోహిత్ శర్మ మరోసారి డకౌట్(Duckout) కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫామ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాడిగా విఫలమవుతున్న ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai Super Kings)తో జరిగిన మ్యాచులో రోహిత్ డకౌట్ అయిన తీరు ఆందోళనకరమన్నాడు. రోహిత్ నిర్లక్ష్యంగా ఆడి ఔట్ అయ్యాడని, అది కెప్టెన్ ఆడే షాట్ కాదని అన్నారు. విశ్రాంతి తీసుకొని, ఫ్రెష్‌గా తిరిగి రావడంపై రోహిత్ ఆలోచించాలని సూచించారు.

త్వరలో WTC ఫైనల్ ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మ ఫాంలోకి రావాల్సి ఉందన్నాడు. రోహిత్ ఫిట్ గా ఉండాలని సూచించాడు. ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌ల నుంచి బ్రేక్(Break) తీసుకోవాలన్నాడు. ఐపీఎల్ వైఫల్య ప్రభావం WTC ఫైనల్‌పై పడకూడదని కోరుకుంటున్నట్లు గవాస్కర్ తెలిపాడు. రోహిత్ శర్మ తన చివరి నాలుగు ఇన్నింగ్స్‌లలో అతడు చేసిన పరుగులు 5 మాత్రమే. ఐపీఎల్‌లో అత్యధిక (16) డకౌట్‌లు అయిన ఆటగాడిగా చెత్త రికార్డును రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు.

Updated On 7 May 2023 9:10 AM GMT
Yagnik

Yagnik

Next Story