డిసెంబర్ 2023లో జరిగిన IPL 2024 వేలంలో, వరల్డ్ కప్ ఫైనల్ స్టార్ ట్రావిస్ హెడ్ ను కూడా SRH సొంతం చేసుకుంది.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17వ సీజ‌న్ కు సంబంధించి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హైద‌రాబాద్ జట్టు కెప్టెన్ గా ఎడెన్ మ‌ర్క్‌ర‌మ్‌ పై వేటు వేసింది. ప్యాట్ క‌మిన్స్ ను కెప్టెన్ ను చేస్తూ అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ అందించిన క‌మిన్స్‌కు ప‌గ్గాలు అప్ప‌గిస్తున్న‌ట్టు సోమ‌వారం ఎస్ఆర్‌హెచ్ ప్ర‌క‌టించింది. 17వ సీజ‌న్‌లో శుభ్‌మ‌న్ గిల్‌ గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టుకు, హార్దిక్ పాండ్యా ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌లుగా ఎంపికయ్యారు. ఇక మిగిలిన జట్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయోనని అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024కి ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ స్టార్ పాట్ కమిన్స్ కెప్టెన్‌గా ఉంటాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ సోమవారం ప్రకటించింది. వేలంలో రూ. 20.5 కోట్లకు కొనుగోలు చేసిన కమిన్స్, దక్షిణాఫ్రికా అంతర్జాతీయ ఆటగాడు ఐడెన్ మార్క్‌రామ్ స్థానంలో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. డిసెంబర్ 2023లో జరిగిన IPL 2024 వేలంలో, వరల్డ్ కప్ ఫైనల్ స్టార్ ట్రావిస్ హెడ్ ను కూడా SRH సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌ను రూ. 20.5 కోట్లకు కొనుగోలు చేసి ఎస్.ఆర్.హెచ్. రికార్డు సృష్టించింది.

SRH కొనుగోలు చేసిన ఆటగాళ్ల జాబితా:

1. ట్రావిస్ హెడ్ (రూ. 6.8 కోట్లు)

2. వనిందు హసరంగా (రూ. 1.5 కోట్లు)

3. పాట్ కమిన్స్ (20.5 కోట్లు)

4. జయదేవ్ ఉనద్కత్ (రూ. 1.6 కోట్లు)

5. ఆకాష్ సింగ్ (రూ. 20 లక్షలు)

6. జాతవేద్ సుబ్రమణ్యన్ (రూ. 20 లక్షలు)

Updated On 4 March 2024 1:01 AM GMT
Yagnik

Yagnik

Next Story