Asia Cup 2023 Afghanistan Vs Sri Lanka : శ్రీలంక మ్యాచ్ గెలిస్తే.. ఆఫ్ఘనిస్థాన్ హృదయాలను గెలిచింది..!
ఆసియా కప్‌లో భాగంగా జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంక రెండు పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. దీంతో శ్రీలంక జట్టు సూపర్ ఫోర్‌లో స్థానం ఖాయం చేసుకుంది.
ఆసియా కప్(Asia Cup)లో భాగంగా జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంక(Srilanka) రెండు పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్(Afghanistan)ను ఓడించింది. దీంతో శ్రీలంక జట్టు సూపర్ ఫోర్(Super Four)లో స్థానం ఖాయం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన అఫ్గానిస్థాన్ జట్టు 289 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆఫ్ఘనిస్థాన్‌ను రెండు పరుగుల తేడాతో ఓడించిన శ్రీలంక ఆసియా కప్‌లో సూపర్ ఫోర్‌లోకి ప్రవేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టులో కుశాల్ మెండిస్(Kushal Mendis) 92 పరుగులతో రాణించడంతో 291 పరుగులు చేసింది. సమాధానంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు 289 పరుగులకే ఆలౌటై రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. 37వ ఓవర్లో ధనంజయ్ డిసిల్వా(Danunjay De Silva) రెండు వికెట్లు తీసి శ్రీలంకకు ఉత్కంఠ విజయాన్ని అందించాడు.
ఆఫ్ఘనిస్థాన్ తరఫున మహమ్మద్ నబీ 32 బంతుల్లో 65 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్గానిస్థాన్ తరఫున గుల్బాదిన్ నైబ్ నాలుగు వికెట్లు, రషీద్ ఖాన్(Rashid Khan) రెండు, ముజీబ్(Mujeeb) ఒక వికెట్ తీశారు. కాగా, శ్రీలంక తరఫున కసున్ రజిత(Rajitha) నాలుగు వికెట్లు తీయగా, ధనంజయ్ డిసిల్వా, దునిత్ వెలలాగే తలో రెండు వికెట్లు తీశారు. తిక్షణ, పతిరనా చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో శ్రీలంక జట్టు ఆసియాకప్‌లో సూపర్‌ఫోర్‌కు చేరుకుంది. శ్రీలంకతో పాటు భారత్(India), పాకిస్థాన్(Pakistan), బంగ్లాదేశ్(Bangladesh)లు సూపర్ ఫోర్‌లో చోటు దక్కించుకున్నాయి.
ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 37.1 ఓవర్లలో లక్ష్యాన్నిఛేదించి సూపర్‌ఫోర్‌కు చేరుకోవాల్సి ఉంది. అందులో భాగంగానే 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టు 37 ఓవర్లలో 8 వికెట్లకు 289 పరుగులు చేసింది. చివరి బంతికి(37.1వ బంతికి) మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. ముజీబ్ క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో సూపర్ ఫోర్ ఆశలు గల్లంతవగా.. ఆ తర్వాత తర్వాత వచ్చిన ఫరూఖీ వికెట్ల ముందు దొరికిపోవడంతో ఆఫ్ఘన్ జట్టు రెండు పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. అయితే అంతకుముందు ఓవర్ వరకూ ఆఫ్ఘనిస్థాన్ జట్టు సూపర్ ఫోర్‌కు చేరుకునేలా కనిపించింది.ఒక్క ఓవర్‌లో మ్యాచ్ ఫలితం తారుమారైంది. ఏది ఏమైనా ఆఫ్ఘనిస్థాన్ పోరాటం మాత్రం అభిమానుల హృదయాలను గెలుచుకుంది.