క్వాలిఫయర్-1 లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నిరాశ ఎదురైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో

క్వాలిఫయర్-1 లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నిరాశ ఎదురైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్-1లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోల్ కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ మొదట 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యాన్ని కోల్ కతా నైట్ రైడర్స్ కేవలం 13.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జోడీ సన్ రైజర్స్ కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వెంకటేశ్ అయ్యర్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ లతో 51 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ లతో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. కోల్ కతా ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (23), సునీల్ నరైన్ (21) తొలి వికెట్ కు 44 పరుగులు జోడించి మంచి ఆరంభాన్ని అందించారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు 19.3 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే ట్రావిస్ హెడ్ (0) డకౌట్ కాగా, రెండో ఓవర్లోనే అభిషేక్ శర్మ (3) అవుటయ్యాడు. 39 ఓవర్లకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సన్ రైజర్స్ ను రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ జోడీ ఆదుకుంది. త్రిపాఠి 35 బంతుల్లో 55 పరుగులు చేయగా, క్లాసెన్ 21 బంతుల్లో 32 పరుగులు చేశాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 30 పరుగులు చేయడంతో సన్ రైజర్స్ స్కోరు 150 మార్కు దాటింది. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీశాడు. స్టార్క్... హెడ్, నితీశ్ రెడ్డి (9), షాబాజ్ అహ్మద్ (0)లను అవుట్ చేశాడు. వరుణ్ చక్రవర్తి 2, వైభవ్ అరోరా 1, హర్షిత్ రాణా 1, సునీల్ నరైన్ 1, ఆండ్రీ రసెల్ 1 వికెట్ తీశారు. ఈ ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు క్వాలిఫయర్స్-2లో ఆడాల్సి ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుతో సన్ రైజర్స్ మే 24న చెన్నైలో క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడనుంది.

Updated On 21 May 2024 8:38 PM GMT
Yagnik

Yagnik

Next Story