సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. గురువారం రాత్రి గుజరాత్ టైటాన్స్

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. గురువారం రాత్రి గుజరాత్ టైటాన్స్ తో హైదరాబాద్ లో మ్యాచ్ జరగాల్సి ఉండగా, వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. దాంతో ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. టోర్నీలో ఇప్పటిదాకా 14 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ ఖాతాలో మొత్తం 15 పాయింట్లు ఉన్నాయి. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ లో ప్రవేశించాయి. ఈ ఒక్క పాయింట్ తో సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ చేరిన మూడో జట్టయింది. నాలుగో బెర్తు కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ మే 18న బెంగళూరులో జరగనుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచి క్వాలిఫై అవ్వాలంటే.. 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకోవాలి.. లేదా ఈ మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో గెలవాలి.

ఇక లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లు, మైనస్ 0.787 నెట్ రన్ రేట్‌తో ఉంది. తన చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో లక్నో తలపడనుంది. నెట్ రన్ రేట్‌ భారీ మైనస్‌లో ఉండడంతో ముంబైపై గెలిచినప్పటికీ ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. టెక్నికల్‌గా అవకాశం కనిపిస్తున్నా అది దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లు, మైనస్ 0.377 నెట్ రన్ రేట్‌తో ఉంది. ఆ జట్టు లీగ్ దశ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాయి. రన్ రేట్‌ను మెరుగుపరచుకునేందుకు మ్యాచ్‌లు లేకపోవడంతో ప్లేఆఫ్ రేసు నుంచి ఢిల్లీ దూరమైంది.

Updated On 16 May 2024 9:43 PM GMT
Yagnik

Yagnik

Next Story