సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా జట్టు(Team India) ఐసీసీ ట్రోఫీని(ICC Trophy) గెల్చుకుంది. టీ-20 ప్రపంచకప్‌లో(T-20 World Cup) విజయం సాధించి చరిత్ర సృష్టించింది

సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా జట్టు(Team India) ఐసీసీ ట్రోఫీని(ICC Trophy) గెల్చుకుంది. టీ-20 ప్రపంచకప్‌లో(T-20 World Cup) విజయం సాధించి చరిత్ర సృష్టించింది. అయితే ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన సూర్యకుమార్‌ యాదవ్‌(Surya Kumar Yadav) క్యాచ్‌ ప్రస్తుతం వివాదాస్పందగా మారింది. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్‌ మిల్లర్‌ కొట్టిన షాట్‌ను సూర్య కుమార్‌ యాదవ్‌ బౌండరీ లైన్‌ దగ్గర క్యాచ్‌ పట్టాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. సూర్యకుమార్‌ సూపర్‌ మ్యాన్‌లా క్యాచ్‌ పట్టాడని ఫ్యాన్స్‌ అంటుంటే, అసలు ఇది క్యాచే కాదని, సిక్సర్‌ అని సౌతాఫ్రికా ఫ్యాన్స్‌ అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. ఈ వీడియోలో సూర్యకుమార్‌ క్యాచ్‌ పట్టుకునే క్రమంలో అతడి కాలు బౌండరీ లైన్‌ను తాకినట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ సౌతాఫ్రికా అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. తాము దోచుకోబడ్డామని చెబుతున్నారు. టీమిండియా మోసం చేసి గెలిచిందని అంటున్నారు. బంతి చేతిలో ఉన్నప్పుడు సూర్యకుమార్‌ కాలు బౌండరీ లైన్‌ను తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్‌ ఏమాత్రం ఆలోచించకుండా అవుట్‌గా ప్రకటించడం ఆశ్చర్యకరమని, అతడు నిజాయితీగా వ్యవహరించలేదని అంటున్నారు. ఒకవేళ ఆ బంతిని సిక్సర్‌గా ప్రకటించి ఉంటే దక్షిణాఫ్రికా వరల్డ్‌కప్‌ గెలిచేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాగైతేనేమీ ఈ వీడియో మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది.

Eha Tv

Eha Tv

Next Story