2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన 23వ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ విజయంతో ఆఫ్రికన్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకి సెమీఫైనల్‌కు చేరువైంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 382 పరుగులు చేసింది.

2023 వన్డే ప్రపంచకప్‌(World Cup)లో భాగంగా బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరిగిన 23వ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa) విజయం సాధించింది. ఈ విజయంతో ఆఫ్రికన్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకి సెమీఫైనల్‌(Semi Final)కు చేరువైంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa) టాస్(Toss) గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 382 పరుగులు చేసింది. అనంత‌ర‌రం బంగ్లాదేశ్ 233 పరుగులకే ఆలౌటైంది. దీంతో 149 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో విజయంతో ఆఫ్రికన్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్‌ 46.4 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది. బంగ్లాదేశ్ తరఫున మహ్మదుల్లా (111) సెంచ‌రీ చేశాడు, కానీ అతని ఇన్నింగ్స్ జట్టుకు విజ‌యాన్ని అందించ‌లేక‌పోయింది. దక్షిణాఫ్రికా తరఫున క్వింటన్ డి కాక్(Quinton De Cock) 174, హెన్రిచ్ క్లాసెన్(Henrich Klassen) 90 పరుగులు చేశారు. కెప్టెన్ మార్క్రామ్(Aiden Markram) 60 పరుగులు చేశాడు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్రికన్ జట్టుకు ఆదిలోనే షాక్ త‌గిలింది. రెజా హెండ్రిక్స్ (12), రాస్సీ వాన్ డెర్ డస్సెన్(1) త్వ‌ర‌గానే ఔట్ అయ్యారు. ఆ తర్వాత క్వింటన్ డి కాక్ మూడో వికెట్‌కు కెప్టెన్ ఐడెన్ మార్క్‌రామ్‌తో కలిసి 131 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్ర‌మంలోనే డి కాక్ తన వన్డే కెరీర్‌లో 20వ సెంచరీని.. ప్రపంచకప్‌లో మూడో సెంచరీని సాధించాడు. మార్క్రామ్ కూడా తొమ్మిదో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఈ భాగస్వామ్యాన్ని షకీబ్ బ్రేక్ చేశాడు. మార్క్రామ్ 69 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. 150వ వన్డే ఆడిన‌ డి కాక్ 140 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 174 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. గతంలో ఈ రికార్డు డేవిడ్ వార్నర్(David Warner) పేరిట ఉండేది. పాకిస్థాన్‌(Pakistan)పై 163 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. దీని తర్వాత హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్లాసెన్, డి కాక్ మధ్య 141 పరుగుల భాగస్వామ్యం ఉంది. క్లాసెన్ 49 బంతుల్లో రెండు ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్(David Miller) 15 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్ల సాయంతో 34 పరుగులు, మార్కో జాన్సెన్ ఒక పరుగు చేసి నాటౌట్‌గా నిలిచారు.

383 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ జట్టు ఏ ద‌శ‌లోనూ పోరాట ప‌టిమ‌ను ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయింది. తంజిద్ హసన్, లిటన్ దాస్ ఇన్నింగ్సును నెమ్మదిగా ఆరంభించారు. ఈ జోడీ ఆరు ఓవర్లలో 30 పరుగులు జోడించడన త‌ర్వాత తాంజిద్ హసన్ ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికే నజ్ముల్ హసన్ కూడా అవుటయ్యాడు. ఒక పరుగు చేసి కెప్టెన్ షకీబ్ ఔట్ కాగా, ఎనిమిది పరుగుల వద్ద ముష్ఫికర్ రహీమ్ ఔటయ్యాడు. లిటన్ దాస్ కూడా 44 బంతుల్లో 22 పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో బంగ్లాదేశ్ 81 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ త‌ర్వాత‌ మహ్మదుల్లా ఒక ఎండ్‌లో పాతుకుపోయాడు. చివ‌రి వ‌రుస బ్యాట్స్‌మెన్ సాయంతో స్కోరు బోర్డును 200 దాటించాడు. వేగంగా ప‌రుగులు చేసే క్ర‌మంలో మహ్మదుల్లా సెంచ‌రీ అనంత‌రం 111 పరుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వద్ద ఔటయ్యాడు. ఈ సమయానికి బంగ్లాదేశ్ స్కోరు 227/9. ఆ త‌ర్వాత చివ‌రి వికెట్ కూడా 233 పరుగుల వ‌ద్ద ప‌డ‌టంతో బంగ్లా ఇన్నింగ్సు ముగిసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోట్జే మూడు వికెట్లు పడగొట్టాడు. మార్కో యాన్సెన్, కగిసో రబడా, లిజార్డ్ విలియమ్స్ చెరో రెండు వికెట్లు తీశారు. కేశవ్ మహరాజ్ ఒక వికెట్ తీశాడు.

Updated On 24 Oct 2023 11:45 PM GMT
Yagnik

Yagnik

Next Story