Australia vs South Africa ICC WC 2023 : ఆస్ట్రేలియాను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా
2023 వన్డే ప్రపంచకప్‌లో గురువారం దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాతో తలపడింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా జట్టు భారీ విజయం సాధించింది. భారత్‌పై తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి చవిచూసింది.
2023 వన్డే ప్రపంచకప్(World Cup)లో గురువారం దక్షిణాఫ్రికా(South Africa) జట్టు ఆస్ట్రేలియా(Australia)తో తలపడింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక(Srilanka)పై దక్షిణాఫ్రికా జట్టు భారీ విజయం సాధించింది. భారత్‌పై తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. బదులుగా ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది.
దక్షిణాఫ్రికా 134 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. క్వింటన్ డి కాక్(Quinton De Cock) 106 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. ఐడెన్ మార్క్రామ్(Aiden Markram) 44 బంతుల్లో 56 పరుగులు చేశాడు. అనంతరం ఆస్ట్రేలియా జట్టు 40.5 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. మార్నస్ లాబుషాగ్నే అత్యధికంగా స్కోరు 46 పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్(Mitchell Stark) 27 పరుగులు చేశాడు. కగిసో రబడా(Kagiso Rabada) మూడు వికెట్లు తీయగా, కేశవ్ మహరాజ్(Keshav Maharaj), తబ్రైజ్ షమ్సీ చెరో రెండు వికెట్లు తీశారు.
ఈ ప్రపంచకప్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. దక్షిణాఫ్రికా జట్టుకు ఇది వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించింది. సెంచరీ చేసిన క్వింటన్ డి కాక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.