దక్షిణాఫ్రికా పర్యటనను భారత జట్టు ఓటమితో ప్రారంభించింది. మూడు టీ20ల సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. డర్బన్‌లో జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

దక్షిణాఫ్రికా(South Africa) పర్యటనను భారత జట్టు(Teamindia) ఓటమితో ప్రారంభించింది. మూడు టీ20ల సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. డర్బన్‌(Durban)లో జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో టీ20లో టీమిండియా ఓటమిని చవిచూసింది. ఐదేళ్ల తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. 2018లో సెంచూరియన్‌ మైదానంలో టీమిండియా చివరిసారి ఓటమి పొందింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో దక్షిణాఫ్రికా సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ డిసెంబర్ 14న జరగనుంది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోతే సిరీస్‌ను చేజార్చుకున్నట్టే. భారత్ చివరిసారిగా 2012లో దక్షిణాఫ్రికాలో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. అప్పుడు సిరీస్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత 2018లో భారత్‌ 2-1తో విజయం సాధించింది.

గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్(Aiden Markram) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 19.3 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. రింకు సింగ్(Rinku Singh) 39 బంతుల్లో 68 పరుగులు చేసి భారత్ తరఫున నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) 56 పరుగులు, తిలక్ వర్మ(Tilak Varma) 29 పరుగులు, రవీంద్ర జడేజా(Ravindra Jadeja) 19 పరుగులు చేశారు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఖాతాలను తెరవలేకపోయారు. దీంతో డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం.. దక్షిణాఫ్రికా 15 ఓవర్లలో 152 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలో 154 పరుగులు చేసి విజ‌యం సాధించింది.

ఆఫ్రికన్ జట్టు బ్యాట్స్‌మెన్ లక్ష్యాన్ని సులువుగా ఛేదించారు. రీజా హెండ్రిక్స్ 27 బంతుల్లో 49 పరుగులు, కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ 17 బంతుల్లో 30 పరుగులు, డేవిడ్ మిల్లర్ 17, మాథ్యూ బ్రిట్జ్కే 16, ట్రిస్టన్ స్టబ్స్ 14 నాటౌట్, ఆండిలే ఫెహ్లుక్వాయో 10 నాటౌట్‌గా రాణించారు. హెన్రిచ్ క్లాసెన్ ఏడు పరుగులు చేశాడు. 14వ ఓవర్ ఐదో బంతికి ఫెహ్లుక్వాయో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. భారత్ తరఫున ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీశాడు. మహ్మద్‌ సిరాజ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ ఒక్కో వికెట్ ప‌డ‌గొట్టారు.

Updated On 12 Dec 2023 11:15 PM GMT
Yagnik

Yagnik

Next Story