ప్రస్తుతం పాకిస్థాన్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ వన్ డే కప్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం పాకిస్థాన్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ వన్ డే కప్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్ ప్ర‌పంచ‌క‌ప్ పైన‌ల్‌లో ప‌ట్టిన‌ చిరస్మరణీయ క్యాచ్‌ను పాకిస్థాన్‌ ఆటగాడు సైమ్‌ అయూబ్‌ కాపీ కొట్టేందుకు ప్రయత్నించడం గమనించవచ్చు. అయితే.. అతడు ఆ ప్రయత్నంలో విజయం సాధించలేదు. దీంతో ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పాకిస్థాన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాంథర్స్, డాల్ఫిన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సైమ్ అయూబ్ బౌండరీపై అద్భుత క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించాడు. అయితే అందులో అతడు విఫ‌ల‌మ‌వ‌డంతో బంతి బౌండరీ లైన్ దాటి ప‌డింది. రెండో ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌లో మహ్మద్ అఖ్లాక్ లాంగ్ ఆఫ్ దిశగా ఉసామా మిర్ బౌలింగ్‌లో ఈ షాట్ ఆడాడు. బౌండరీ లైన్ వ‌ద్ద‌ అయూబ్ బంతిని సునాయాసంగా క్యాచ్ చేశాడు. అయితే బ్యాలెన్స్ త‌ప్ప‌డంతో అతడు బంతిని గాలిలోకి విసిరాడు.. కానీ అది బౌండరీ దాటి పోయింది. దీంతో వికెట్‌తో పాటు జట్టు 6 పరుగుల నష్టాన్ని చవిచూసింది.

T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టి భారత్ మ్యాచ్‌ను గెలుచుకునేలా చేశాడు. సూర్యకుమార్ యాదవ్ పట్టిన ఈ క్యాచ్ తో మ్యాచ్ మొత్తం తలకిందులు అయ్యింది. ప్రమాదకరంగా కనిపిస్తున్న డేవిడ్ మిల్లర్ ఇచ్చిన‌ క్యాచ్‌ను బౌండరీ వద్ద సూర్యకుమార్ యాదవ్ పట్టాడు. చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికాకు 16 పరుగులు కావాలి. లాంగ్ ఆఫ్ దిశగా హార్దిక్ పాండ్యా వేసిన ఫుల్ టాస్ ను మిల్లర్ కొట్టాడు. బౌండరీ వద్ద సూర్యకుమార్ యాదవ్ విజ్ఞత ప్రదర్శించి అద్భుత క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్‌ కారణంగా భారత జట్టు 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.


Sreedhar Rao

Sreedhar Rao

Next Story