Asia Cup PAK vs SL : ఓడిన పాక్.. భారత్ ఫైనల్ ఆడేది శ్రీలంకతోనే..!
ఆసియా కప్ సూపర్-4 రౌండ్‌లో శ్రీలంక రెండు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. దీంతో శ్రీలంక జట్టు ఫైనల్‌కు చేరుకుంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42 ఓవర్లలో 252 పరుగులు చేసింది.
ఆసియా కప్(Asia Cup) సూపర్-4 రౌండ్‌లో శ్రీలంక(Srilanka) రెండు వికెట్ల తేడాతో పాకిస్థాన్(Pakistan)ను ఓడించింది. దీంతో శ్రీలంక జట్టు ఫైనల్‌కు చేరుకుంది. వర్షం(Rain) అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42 ఓవర్లలో 252 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ నియమావళి ప్రకారం.. శ్రీలంక 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఎనిమిది వికెట్లు కోల్పోయి చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించి శ్రీలంక విజయం సాధించింది. దీంతో శ్రీలంక ఫైనల్(Final)కు చేరుకుంది.
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. పాకిస్థాన్ తరఫున మహ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan) అత్యధికంగా అజేయంగా 86 పరుగులు చేశాడు. ఇఫ్తికార్ అహ్మద్(Iftikar Ahmad) 47 పరుగులలో సాయం అందించాడు. రిజ్వాన్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టుకు భారీ స్కోరును అందించారు. అబ్దుల్లా షఫీక్(Abdulla Shafeeq) కూడా 52 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో మతిషా పతిరనా మూడు వికెట్లు, ప్రమోద్ మదుషన్ రెండు వికెట్లు తీశారు. తిక్షణ, వెలల్గేలకు ఒక్కో వికెట్ దక్కింది.
చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించి శ్రీలంక జట్టులో కుశాల్ మెండిస్(Kushal Mendis) అత్యధికంగా 91 పరుగులు చేశాడు. అసలంక(Asalanka) అజేయంగా 49 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. సమరవిక్రమ కూడా 48 పరుగులు చేశాడు. పాక్ తరఫున ఇఫ్తికార్ అహ్మద్ మూడు వికెట్లు, షాహీన్ అఫ్రిది(Shaheen Afridi) రెండు వికెట్లు తీశారు. షాదాబ్ ఖాన్‌కు ఒక వికెట్ దక్కింది.
సెప్టెంబర్ 17న భారత్-శ్రీలంక మధ్య ఆసియాకప్ ఫైనల్(Asia Cup Final) మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు సెప్టెంబర్ 15న బంగ్లాదేశ్‌తో టీమిండియా ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ టోర్నీపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎందుకంటే బంగ్లాదేశ్(Bangladesh) జట్టు సూపర్ ఫోర్‌లో తన మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. భారత జట్టు(Teamindia) ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు చేరుకుంది.