India Vs West Indies 3rd T20 : సూర్యకుమార్ యాదవ్ మెరుపులు.. గెలిచి నిలిచిన భారత్
వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను కోల్పోకుండా 2-1తో కాపాడుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 159 పరుగులు చేయగా.. భారత్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
వెస్టిండీస్(Westindies)తో జరిగిన మూడో టీ20లో భారత్(India) ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను కోల్పోకుండా 2-1తో కాపాడుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 159 పరుగులు చేయగా.. భారత్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
వెస్టిండీస్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్.. తొలిసారిగా సిరీస్‌లో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఐదు వికెట్లకు 159 పరుగులు చేసింది. భారత్ 17.5 ఓవర్లలో మూడు వికెట్లకు 164 పరుగులు చేసి విజయం సాధించింది. వెస్టిండీస్ తరఫున బ్రెండన్ కింగ్(Brandon King) 42, రోవ్‌మన్ పావెల్(Rovman Powell) 40 పరుగులు చేశారు. భారత్ తరఫున కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) మూడు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఛేదనకు దిగిన భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) 83, తిలక్ వర్మ(Tilak Varma) అజేయంగా 49 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. విండీస్ తరుపున అల్జారీ జోసెఫ్(Alzarri Joseph) బంతితో రెండు వికెట్లు తీశాడు.
ఈ విజయంతో భారత్ సిరీస్‌లో పునరాగమనం చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ రెండు, భారత్ ఒక మ్యాచ్‌లో విజయం సాధించాయి. సిరీస్‌ను గెలవాలంటే భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవాలి. వెస్టిండీస్ జట్టు మరో మ్యాచ్‌లో విజయం సాధిస్తే సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉంది.