Rohit Sharma : సీఎస్‌కే పై ఓటమికి కారణం చెప్పిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2023 12వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు కేవలం 157 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఛేదనకు దిగిన సీఎస్‌కే 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా రెండో ఓటమి. ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. పెద్ద స్టేట్మెంట్ […]
ఐపీఎల్ 2023 12వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు కేవలం 157 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఛేదనకు దిగిన సీఎస్‌కే 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా రెండో ఓటమి. ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. పెద్ద స్టేట్మెంట్ నే ఇచ్చాడు.
ఐపీఎల్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన నేపథ్యంలో.. తాను, ఇతర సీనియర్ ఆటగాళ్లు బాధ్యతను భుజాన వేసుకుని మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుందని రోహిత్ శర్మ(Rohit Sharma) అభిప్రాయపడ్డాడు. రోహిత్, సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav), ఇషాన్ కిషన్(Ishan Kishan) లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో శనివారం వాంఖడే స్టేడియం(Wankhede Stadium) లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.
నాతో పాటు ఇతర అనుభవజ్ఞులైన ఆటగాళ్లు బాధ్యత తీసుకుని బ్యాట్‌తో ఎక్కువ పరుగులు చేయాల్సిన అవసరం ఉందని మ్యాచ్ అనంతరం రోహిత్ చెప్పాడు. ఐపీఎల్ తీరు మనకు తెలుసు. మాకు కాస్త రిథమ్ రావాలి. అదేం పెద్ద కష్టమేం కాదు. విభిన్నంగా ప్రయత్నించాలని రోహిత్.. టీమ్‌లోని బ్యాట్స్‌మెన్‌లను కోరాడు.
ఎటాక్ చేయాలి, ధైర్యంగా ఆడాలి, రకరకాలుగా ప్రయత్నించాలని రోహిత్ అన్నాడు. యువ ఆటగాళ్లు ఉన్నారు. వారికి కొంత సమయం ఇవ్వాలి. దానికి సమయం పడుతుంది. మనం వారి సామర్థ్యాన్ని విశ్వసించాలని అన్నాడు. పవర్‌ప్లేలో ముంబై జట్టు ఒక వికెట్‌కు 61 పరుగులు చేసిన తర్వాత కూడా.. 8 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరో 40 పరుగులు చేసి ఉండాల్సిందని.. బ్యాటింగ్ వైఫల్యమే చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) చేతిలో తమ ఓటమికి ప్రధాన కారణమని రోహిత్ చెప్పాడు.