ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆదివారం జరిగిన 61వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆదివారం జరిగిన 61వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో జ‌రిగిన‌ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ భారీ స్కోరు చేయడంలో విఫలమై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో పాయింట్ల పట్టికలో పెను మార్పు కనిపించింది. ఈ విజయంతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ప్రస్తుత సీజన్‌లో సీఎస్‌కే 13 మ్యాచ్‌లు ఆడగా 7 విజయాలు సాధించింది. చెన్నైకి 14 పాయింట్లు ఉన్నాయి. మరో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌లో తమ స్థానాన్ని దాదాపుగా నిర్ధారించుకోవచ్చు. ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్‌కే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్ రైడర్స్ అగ్రస్థానంలో ఉంది. లీగ్ దశలో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన KKR 9 గెలిచింది. రాజస్థాన్ 12లో 8 విజయాలతో రెండో స్థానంలో, 13లో 7 విజయాలతో సీఎస్‌కే మూడో స్థానంలో ఉన్నాయి. SRH 12 మ్యాచ్‌లలో 7 గెలిచి నాల్గవ స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ 12 మ్యాచ్‌లకు గాను 6-6 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. RCB, GT 12-12 మ్యాచ్‌లు ఆడి 5-5 గెలిచాయి. MI, PBKS ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్ర‌మించాయి. ఇప్ప‌టివ‌ర‌కూ కోల్‌కతా మాత్ర‌మే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. మిగిలిన 7 జట్లు ఇప్పటికీ ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి.

Updated On 12 May 2024 10:03 AM GMT
Yagnik

Yagnik

Next Story