భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు 55 పరుగులకే ఆలౌటైంది.

భారత్(India)-దక్షిణాఫ్రికా(South Africa) మధ్య జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు 55 పరుగులకే ఆలౌటైంది. అనంత‌రం భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 175 పరుగులు చేయగా.. భారత్‌కు 79 పరుగుల లక్ష్యాన్ని అందించింది. దీనిని భారత్ మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విధంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ డ్రా(Draw)గా ముగిసింది.

ఈ చారిత్రాత్మక విజయం తర్వాత భారత ఆటగాళ్లు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి BCCI తన X ఖాతాలో ఒక వీడియో(Video)ను షేర్ చేసింది. ఆ వీడియోలో భారత ఆటగాళ్ల ముఖాల్లో విజయం సాధించిన ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది.

దక్షిణాఫ్రికా జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టుకు శుభారంభం లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), యశస్వి జైస్వాల్(Yashaswi Jaishwal) మధ్య తొలి వికెట్‌కు 5.4 ఓవర్లలో 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్ప‌గా.. విజయానికి చేరువయ్యే సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయింది. దీని తర్వాత ఇన్నింగ్స్ 12వ ఓవర్ చివరి బంతికి శ్రేయాస్(Shreyas Iyer) ఫోర్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు.

కేప్ టౌన్ టెస్టులో శ్రేయస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు యశస్వి 'చౌకా-చౌకా' అని అర‌వ‌డం వీడియో(Vide0)లో చూడొచ్చు. అనుకున్న‌ట్లుగానే అతని కోరిక నెరవేరింది. దీంతో అతను గిల్‌తోపాటు బిగ్గరగా అరుస్తూ విజయాన్ని సెల‌బ్రేట్ చేసుకోవ‌డం ప్రారంభించాడు. అలాగే.. విరాట్ కోహ్లీ(Virat Kohli) విజయం తర్వాత కోచ్ రాహుల్ ద్రవిడ్‌(Rahul Dravid)ను కౌగిలించుకోవడం కూడా చూడ‌వ‌చ్చు. బుమ్రా(Jaspreeth Bhumra)తో సహా ఇతర ఆటగాళ్లు కూడా ఒకరినొకరు కౌగిలించుకుని విజయానికి సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

Updated On 5 Jan 2024 10:14 PM GMT
Yagnik

Yagnik

Next Story