Shubman Gill : ఆసుపత్రిలో చేరిన గిల్.. ఇండియా-పాక్ మ్యాచ్‌కు కూడా కష్టమే..!
2023 ప్రపంచకప్‌ను భారత జట్టు విజయంతో ప్రారంభించింది. తర్వాతి మ్యాచ్‌లో టీమిండియా ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడాల్సి ఉంది. అక్టోబర్ 14న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. అయితే డెంగ్యూ కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడని శుభ్‌మన్ గిల్..
2023 ప్రపంచకప్(World Cup)ను భారత జట్టు(Teamindia) విజయంతో ప్రారంభించింది. తర్వాతి మ్యాచ్‌లో టీమిండియా ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడాల్సి ఉంది. అక్టోబర్ 14న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. అయితే డెంగ్యూ కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడని శుభ్‌మన్ గిల్.. ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌కు కూడా దూరం కానున్నాడు. తాజా నివేదికలను విశ్వసిస్తే గిల్ పాకిస్తాన్(Pakistan)పై మ్యాచ్ కూడా ఆడలేడని తెలుస్తోంది.
అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ కోసం భారత జట్టు ఢిల్లీ(Delhi)కి చేరుకుంది. అయితే శుభ్‌మన్ గిల్ చెన్నై(Chennai)లోనే ఆస్పత్రిలో చేరాడు. PTI నివేదిక ప్రకారం.. గిల్ ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అతన్ని చెన్నైలోని కావేరీ ఆసుపత్రి(Kaveri Hospital)లో చేర్చారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌కు కూడా గిల్ స్టేడియానికి రాలేదు.
నాలుగు రోజుల తర్వాత అక్టోబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. గిల్ ఫేవరెట్ గ్రౌండ్ నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఆ మ్యాచ్‌లో కూడా అతడికి ఆడే అవకాశాలు లేవు. మూలాల ప్రకారం.. రాబోయే రోజుల్లో గిల్ పరిస్థితి మెరుగుపడితే.. అతను డిశ్చార్జ్(Discharge) అయ్యి జట్టుతో చేరే అవకాశం ఉంది. గిల్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు ఉంటే మాత్రమే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో జట్టులో చేరడానికి నేరుగా అహ్మదాబాద్‌కు వెళ్లవచ్చు.
ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. 20 మ్యాచ్‌ల్లో 72 సగటుతో 1,230 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు(Century) ఉండగా.. అందులో డబుల్ సెంచరీ(Double Century) కూడా ఉంది. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గిల్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాపై గిల్ గైర్హాజరీ కొట్టొచ్చినట్లు కనిపించింది.