ఐపీఎల్ 16వ సీజన్ 70వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో త‌ల‌ప‌డిన‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఓటమి చవిచూసింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఐపీఎల్ 16వ సీజన్ 70వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans) తో త‌ల‌ప‌డిన‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆRoyal Challengers Banglore)) ఓటమి చవిచూసింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం(Chinna Swamy Stadium)లో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. చేధ‌న‌కు దిగిన‌ గుజరాత్ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఈ ఓటమి తర్వాత ఆర్సీబీ జట్టు ఐపీఎల్‌ నుంచి నిష్క్రమించింది. దీంతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంది.

ఫాఫ్ డుప్లెసిస్(Faf Du Plessiss) సారథ్యంలోని ఆర్సీబీ జట్టు మరోసారి టైటిల్‌(Title)కు దూరమైంది. గత సీజ‌న్‌లో ప్లేఆఫ్స్‌(Playoffs)కు చేరిన ఆర్సీబీ ఈసారి ఐదో స్థానంలో నిలిచింది. గుజరాత్ విజయంతో ముంబై ఇండియన్స్(Mumbai Indians) లాభపడింది. 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. అదే సమయంలో ఆర్సీబీ 14 పాయింట్లతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఆర్సీబీ నెట్ రన్‌రేట్‌(Net Runrate) ముంబై కంటే మెరుగ్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్లేఆఫ్‌కు చేరాలంటే ముంబై జట్టుకు విజయం అవసరం.. అయితే అది జరగలేదు.

టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. గుజరాత్ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. వెటరన్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరుపున అజేయంగా 101 పరుగులు చేశాడు. గుజ‌రాత్ టైటాన్స్‌ యువ స్టార్ శుభ్‌మన్ గిల్ 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. 52 బంతుల్లో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు బాదాడు. విజయ్ శంకర్ కూడా 35 బంతుల్లో 53 పరుగులు చేశాడు.వృద్ధిమాన్ సాహా(Vriddiman Saha), డేవిడ్ మిల్లర్(David Miller), దాసున్ షనక విఫ‌ల‌మయ్యారు. ఆర్సీబీ తరఫున మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. విజయ్‌కుమార్(Vijay Kumar), హర్షల్ పటేల్(Harshal Patel) చెరో వికెట్ తీశారు.

అంతకుముందు ఆర్‌సీబీ తరఫున విరాట్ కోహ్లీ(Virat Kohli) 61 బంతుల్లో 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోహ్లీ13 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 28, మైకేల్ బ్రేస్‌వెల్(Michel Bracewell) 26, అనుజ్ రావత్(Anuj Rawat) 15 బంతుల్లో 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్ విఫ‌ల‌మ‌య్యారు. దినేష్ కార్తీక్(Dinesh Karthik) డ‌కౌట‌య్యాడు. గుజరాత్ తరఫున నూర్ అహ్మద్ అత్యధికంగా రెండు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, యష్ దయాల్ తలా ఒక వికెట్ తీశారు.

Updated On 21 May 2023 11:13 PM GMT
Yagnik

Yagnik

Next Story