✕
Shruti Haasan Emotional : చెన్నై ఓడిందని వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్..!
By ehatvPublished on 26 April 2025 10:10 AM GMT
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మ్యాచ్‌లో CSK ఓడిపోయిన తర్వాత శృతి హాసన్ చేపాక్ స్టేడియంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నట్లు వీడియోలు వచ్చాయి.

x
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మ్యాచ్‌లో CSK ఓడిపోయిన తర్వాత శృతి హాసన్ చేపాక్ స్టేడియంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నట్లు వీడియోలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శృతి చెన్నై ఫ్యాన్‌గా స్టేడియంలో మ్యాచ్ చూస్తూ, జట్టు ఓటమి తర్వాత ఎమోషనల్ అయినట్లు వార్తలు వచ్చాయి.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ని ఓడించింది. చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు: 154/10 (19.5 ఓవర్లలో)
డెవాల్డ్ బ్రెవిస్: 42 (25 బంతులు, 4 సిక్సర్లు), ఆయుష్ మాత్రే: 30 (18 బంతులు), రవీంద్ర జడేజా: 21 పరుగులు. 155 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.

ehatv
Next Story