IND vs BAN Test Series : భారత్‌తో టెస్టు సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈ సిరీస్ సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానుంది, ఇందులో మొదటి మ్యాచ్ MA చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు బంగ్లాదేశ్ టెస్టు జట్టుకు నజ్ముల్ శాంటో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇటీవల పాకిస్థాన్‌తో సిరీస్ ఆడిన బంగ్లాదేశ్ జట్టులో ఒకే ఒక్క మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా షోరిఫుల్ ఇస్లాం భారత్‌తో టెస్టు సిరీస్‌లో ఆడడం లేదు. అతడి స్థానంలో 26 ఏళ్ల అన్‌క్యాప్‌డ్ ఆటగాడు జకీర్ అలీ జట్టులోకి సెలక్ట్ అయ్యాడు. జకీర్ దేశవాళీ మ్యాచ్‌లలో మంచి ప్రదర్శన కారణంగా సెలెక్టర్లు అతనికి అవకాశం ఇచ్చారు. జకీర్ 49 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 2,862 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు.. ఇప్పుడు భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌తో టెస్టు సిరీస్‌కు పెద్దగా మార్పులు లేకుండానే జట్టును ప్రకటించారు. ఈ సిరీస్‌లో తొలి టెస్టుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 బరిలో ఉన్న రెండు జట్లకు ఈ సిరీస్ చాలా ముఖ్యమైంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానంలో ఉండగా.. పాకిస్థాన్‌పై విజయం సాధించి బంగ్లాదేశ్ జట్టు నాలుగో స్థానానికి చేరుకుంది.
బంగ్లాదేశ్ జట్టు..
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్ హసన్ జాయ్, జకీర్ హసన్, షద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రాణా, హసన్ మహ్మద్, తస్కిన్ ఖలీద్ అహ్మద్, జెకర్ అలీ అనిక్.