మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొహాలీ స్టేడియంలో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది

Shivam Dube, bowlers guide India to six wicket win over Afghanistan
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొహాలీ స్టేడియంలో భారత్, ఆఫ్ఘనిస్థాన్(India vs Afghanistan) జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమ్ ఇండియాకు ఇదే చివరి టీ20 సిరీస్ కావడం విశేషం. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) కూడా ఈ సిరీస్ కోసం T20 జట్టులోకి తిరిగి వచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్ ఆడలేదు.ఇక ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్(Rasheed Khan) కూడా గాయం కారణంగా మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఐదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం భారత్ 17.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఆఫ్ఘనిస్తాన్ జట్టులో నబీ(42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్(0) డకౌటయ్యాడు. శివమ్ దూబే(Shivam Dube) 40 బంతుల్లో 60 పరుగులు, జితేష్ శర్మ(31) పరుగులు చేసి టీమిండియాకు విజ.యాన్ని అందించారు. రింకు సింగ్(Rinku Singh) తొమ్మిది బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ ఇండోర్‌లో జనవరి 14న జరగనుంది.
