Punjab Kings : ఈ సీజన్‌లో మూడో కెప్టెన్‌తో చివరి మ్యాచ్ ఆడబోతున్న పంజాబ్..!
ఐపీఎల్ 17వ సీజన్ తారాస్థాయికి చేరుకుంది. ఆదివారం ఈ సీజన్‌లో చివరి డబుల్ హెడర్ జరుగనుంది. తొలి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుండగా..
ఐపీఎల్ 17వ సీజన్ తారాస్థాయికి చేరుకుంది. ఆదివారం ఈ సీజన్‌లో చివరి డబుల్ హెడర్ జరుగనుంది. తొలి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుండగా.. రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్ టీమ్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్, సామ్ కుర్రాన్ కాకుండా జితేష్ శర్మ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
నిజానికి ఈ సీజన్ పంజాబ్ కింగ్స్‌కు కలిసిరాలేదు. 13 మ్యాచ్‌ల్లో ఎనిమిది ఓటములతో ఆ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. జట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. మే 19న లీగ్ దశలో పంజాబ్ తన చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్ విజయంతో ముగించాలని భావిస్తోంది. అదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది.
ఐపీఎల్ 2024 69వ మ్యాచ్‌కి ముందు పంజాబ్ కింగ్స్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుని.. జితేష్ శర్మకు కెప్టెన్సీని అప్పగించింది. వాస్తవానికి శిఖర్ ధావన్ గాయపడిన తర్వాత.. సామ్ కుర్రాన్ జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే అతను ఇప్పుడు ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లాడు. దీంతో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మ ఈ సీజన్‌లో మూడో కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు.
ఈ ఐపీఎల్ సీజన్ జితేష్‌కు కూడా కలిసిరాలేదు. 13 మ్యాచ్‌ల్లో అతడు 122.05 స్ట్రైక్ రేట్‌తో 155 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో అతడు తన బ్యాట్‌తో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. టోర్నీ ప్రారంభానికి ముందు, టీమ్ మేనేజ్‌మెంట్ శిఖర్ ధావన్ స్థానంలో జితేష్‌ను ఫోటోషూట్ కోసం పంపింది. ఈ సీజన్‌లో అతను జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉంటాడని అంతా భావించారు. అయితే ధావన్ గైర్హాజరీలో సామ్ కుర్రాన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం చూసి అందరూ షాక్ అయ్యారు.