Shikhar Dhawan : ఆసియా కప్‌కు ఎంపికవుతానని ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. కానీ..
భారత స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ చాలా కాలంగా జట్టులో లేడు. ఒకప్పుడు ధావన్‌ను టీమ్ సెలక్టర్లు మొదటి ఎంపికగా చూసేవారు.. కానీ ఇప్పుడు ధావన్ చాలా కాలంగా వారిచే విస్మరించబడుతున్నాడు.
భారత స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్(Shikhar Dhawan) చాలా కాలంగా జట్టులో లేడు. ఒకప్పుడు ధావన్‌ను టీమ్ సెలక్టర్లు(Selectors) మొదటి ఎంపికగా చూసేవారు.. కానీ ఇప్పుడు ధావన్ చాలా కాలంగా వారిచే విస్మరించబడుతున్నాడు. హఠాత్తుగా ధావన్‌ను భారత జట్టు(Team India) పట్టించుకోకపోవడానికి కారణం ఎవరికీ తెలియదు. ధావన్ ఫామ్ క్షీణించిందని కాదు.. ఎందుకు మరి అతడిని ఎంపిక చేయట్లేదు. ధావన్ బాగా ఆడుతున్నాడు. అయినప్పటికీ అతడు అకస్మాత్తుగా జట్టు నుండి తొలగించబడ్డాడు. ధావన్ మొదటిసారి జట్టుకు దూరంగా ఉండటంపై తన స్పందనను తెలిపాడు.
శిఖర్ ధావన్ ఎప్పుడూ సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటాడు. కానీ జట్టుకు ఎంపికకాకపోవడంపై ఎప్పుడూ బహిరంగ ప్రకటన చేయలేదు. తొలిసారిగా ధావన్ జట్టుకు దూరం కావడంపై స్పందించాడు. ఈ సందర్భంగా ధావన్ తన బాధను వ్యక్తం చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ధావన్ తనను జట్టు నుండి తొలగించినప్పటి నుండి.. సెలెక్టర్లతో కూడా మాట్లాడలేదని చెప్పాడు. కావాలంటే టీమ్ ఇండియా సెలక్టర్లతో కూడా మాట్లాడి ఉండేవాడిని.. కానీ తన ఆటపైనే దృష్టి పెట్టినట్లు తెలిపాడు.
భారత జట్టుకు దూరమైన తర్వాత ధావన్ నేషనల్ క్రికెట్ అకాడమీ(National Cricket Academy)లో చేరడం ద్వారా ప్రాక్టీస్(Practice) కొనసాగించాడు. ఆసియా క్రీడల(Asia Cup)కు నా పేరు ఎంపికచేయనప్పుడు.. నేను చాలా ఆశ్చర్యపోయానని ధావన్ చెప్పాడు. ఆసియా క్రీడలకు ఎంపికవుతానని ఎన్నో ఆశలు పెట్టుకున్నా అది కుదరలేదు. అయినా ఇప్పుడు కూడా నేను NCA కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాను. NCA నా జీవితానికి ఒక రూపాన్ని ఇచ్చింది. నాకు అక్కడ ఉండడం ఇష్టం. ఈ కెరీర్‌లో నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ అయ్యాడు. ధావన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.