వెస్టిండీస్‌కు చెందిన వెటరన్ ఫాస్ట్ బౌలర్ షానన్ గాబ్రియెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

వెస్టిండీస్‌కు చెందిన వెటరన్ ఫాస్ట్ బౌలర్ షానన్ గాబ్రియెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. చాలా కాలం పాటు జట్టుకు దూరంగా ఉన్న గాబ్రియెల్.. జూలై 2023లో తన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2019 నుంచి వన్డే జట్టులో, 2013 నుంచి టీ20 అంతర్జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్ర‌మంలోనే తన రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

షానన్ గాబ్రియేల్ 2012లో తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. 36 ఏళ్ల గాబ్రియేల్ తన కెరీర్‌లో 59 టెస్టులు, 25 వన్డేలు, 2 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి మొత్తం 202 వికెట్లు పడగొట్టాడు. అతడు టెస్టులో 104 ఇన్నింగ్స్‌లలో 32.21 సగటుతో 3.42 ఎకానమీతో 166 వికెట్లు తీశాడు. 13/121 టెస్టులో అతని అత్యుత్తమ ప్రదర్శన. 25 వ‌న్డేల‌లో 34.36 సగటుతో 5.92 ఎకానమీతో 33 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 3/17 వన్డే క్రికెట్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన. ఇక‌ 2 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 3 వికెట్లు తీశాడు.

గాబ్రియెల్ సోషల్ మీడియాలో.. "గత 12 సంవత్సరాలుగా వెస్టిండీస్ కోసం అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి నన్ను నేను అంకితం చేసాను. నేను ఇష్టపడే ఆటను అత్యున్నత స్థాయిలో ఆడటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. సామెత ప్రకారం.. అన్ని మంచి విషయాలు తప్పక చెప్పాలి. ఈ రోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. వెస్టిండీస్ కోసం ఆడుతున్నప్పుడు నాకు, నా కుటుంబానికి అందించిన ఆశీర్వాదాలు, అవకాశాల‌కు నేను దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెండవది అభిమానులకు, కోచ్‌లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపున్నాను. క్రికెట్ వెస్టిండీస్ సిబ్బందికి, నా సహచరులకు, నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని రిటైర్మెంట్ నోట్‌ రాశాడు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story