ఆసియా కప్ 2023 మ్యాచ్ సెప్టెంబర్ 2న పల్లెకెలెలో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోయింది.

ఆసియా కప్ 2023 మ్యాచ్ సెప్టెంబర్ 2న పల్లెకెలెలో భారత్(India)-పాకిస్థాన్(Pakistan) మధ్య జరిగింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క బంతి కూడా వేయలేదు. అయితే ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య స్నేహపూర్వ‌క వాతావ‌ర‌ణం నెలకొంది. భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma), హార్దిక్ పాండ్యా(Hardik Pandya)లు పాకిస్థాన్‌కు చెందిన షాదాబ్ ఖాన్(Shadab Khan), షాహీన్ అఫ్రిది(Shaheen Afridi), అఘా సల్మాన్(Agha Salman), హరీస్ రవూఫ్‌(Harees Rauf)లతో కలిసి నవ్వుతూ కనిపించారు.

ఇదొక్కటే కాదు.. పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ కూడా మ్యాచ్ సమయంలో పాండ్యా షూలేస్‌లను కట్టాడు. దీనిపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య స్నేహం గురించి ప్రశ్నలు లేవనెత్తాడు. మ్యాచ్ సమయంలో మ్యాచ్‌పై మాత్రమే దృష్టి పెట్టాలని.. మైదానం వెలుపల స్నేహాన్ని చూపించాలని చెప్పాడు.

గంభీర్ కామెంట్స్‌పై షాహిద్ అఫ్రిది(Shahid Afridi) స్పందించాడు. అది తన అభిప్రాయం. నేను భిన్నంగా ఆలోచిస్తాను. మేం క్రికెటర్లు.. అంబాసిడర్లు కూడా.. మనందరికీ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. అందువల్ల ప్రేమ, గౌరవం అనే సందేశాన్ని ఇవ్వడం మంచిది. అభిమానులకు ఈ సందేశం ఇవ్వడం కూడా ముఖ్యం. అవును.. మైదానంలో దూకుడు ఉండాలి.. అలాగే ఆట‌గాళ్ల మ‌ధ్య స్నేహ పూర్వ‌క వాతావ‌ర‌ణం కూడా ఉండాలి అన్నారు. మైదానం వెలుపల స్వంత జీవితం ఉంటుందని పేర్కొన్నాడు.

భారత జట్టు వంద కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తోందని.. జాతీయ జట్టు కోసం మైదానంలో ఆడుతున్నప్పుడు మైదానం వెలుపల స్నేహాన్ని వదిలిపెట్టాలి.. క్రీడలు ముఖ్యం.. బయట స్నేహం ఉండాలి.. ఇరు దేశాల ఆటగాళ్ల దృష్టిలో దూకుడు ఉండాలని పేర్కొన్న‌డు. "ఆ ఆరు లేదా ఏడు గంటల క్రికెట్ తర్వాత.. మీరు మీకు కావలసినంత స్నేహపూర్వకంగా ఉండవచ్చు. కానీ మ్యాచ్ క్షణాలు చాలా ముఖ్యమైనవి.. ఎందుకంటే మీరు కేవలం మీకు ప్రాతినిధ్యం వహించడం లేదు.. ఒక బిలియన్ కంటే ఎక్కువ మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు" అని గంభీర్ అన్నాడు. ఈ రోజుల్లో మీరు మ్యాచ్‌ల సమయంలో.. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు ఒకరి వెనుక ఒకరు తడుముకోవడం చూస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మీరు ఇలాంటివి చూసి ఉండరని గంభీర్ అన్నాడు.

Updated On 6 Sep 2023 11:30 PM GMT
Yagnik

Yagnik

Next Story