వన్డే ప్రపంచకప్‌లో ఆరో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన‌ ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

వన్డే ప్రపంచకప్‌(World CUp)లో ఆరో మ్యాచ్‌లో న్యూజిలాండ్(New Zealand) 99 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌(Netherlands)ను ఓడించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన‌ ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. అనంతరం నెదర్లాండ్స్ జట్టు 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించింది.

ఈ విజ‌యంతో న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌లలో నాలుగు పాయింట్లు సాధించి మొదటి స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు నెదర్లాండ్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. హైదరాబాద్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడింది.

న్యూజిలాండ్ జ‌ట్టులో ముగ్గురు బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలు సాధించారు. విల్ యంగ్ 70, టామ్ లాథమ్ 53, రచిన్ రవీంద్ర 51 పరుగులు చేశారు. డెరిల్‌ మిచెల్ 48 పరుగులు, మిచెల్ సాంట్నర్ 36 నాటౌట్, డెవాన్ కాన్వే 32 పరుగులుచేశారు. నెదర్లాండ్స్ తరఫున ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్, రీలోఫ్ వాన్ డెర్ మెర్వే తలో రెండు వికెట్లు తీశారు.

నెదర్లాండ్స్ తరఫున కోలిన్ అకెర్‌మన్ అత్యధికంగా 69 పరుగులు చేశాడు. స్కాట్ ఎడ్వర్డ్స్ 30, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 29 పరుగులు చేశారు. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ ఐదు వికెట్లు పడగొట్టాడు. మాట్ హెన్రీ మూడు వికెట్లు,. రచిన్ రవీంద్ర ఒక వికెట్ తీశాడు. ఐదు వికెట్లు తీసిన సాంట్నర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

Updated On 9 Oct 2023 9:30 PM GMT
Yagnik

Yagnik

Next Story