ఆదివారం జ‌రిగ‌న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. హైదరాబాద్ ముందు 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆఖరి బంతికి హైదరాబాద్ గెల‌వ‌డం విశేషం.

ఆదివారం జ‌రిగ‌న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) నాలుగు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌(Rajasthan Royals)ను ఓడించి ప్లే ఆఫ్(Playoffs) ఆశలను సజీవంగా ఉంచుకుంది. టాస్(Toss) ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్(Rajasthan).. హైదరాబాద్(Hyderabad) ముందు 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆఖరి బంతికి హైదరాబాద్ గెల‌వ‌డం విశేషం.

రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రెండు వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. బ‌దులుగా హైదరాబాద్ ఆరు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అబ్దుల్ సమద్(Abdul Samad) చివరి బంతిని సిక్సర్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు సందీప్ శర్మ(Sandeep Sharma) అతన్ని అవుట్ చేశాడు. కానీ అది నో బాల్‌. సమద్ ఫ్రీ హిట్‌(Free Hit)లో సిక్స్ కొట్టి అతని జట్టుకు విజయాన్ని అందించాడు.

రాజస్థాన్ తరఫున జోస్ బట్లర్(Jos Buttler) 95, సంజూ శాంసన్(Sanju Samson) 66 పరుగులు చేశారు. హైదరాబాద్ తరఫున అభిషేక్ శర్మ(Abhishek Sharma) 55, రాహుల్ త్రిపాఠి(Rahul Tripati) 47 పరుగులు చేశారు. చివర్లో గ్లెన్ ఫిలిప్స్(Glenn Philips) ఏడు బంతుల్లో 25 పరుగులు చేసి జట్టును విజయానికి ద‌గ్గ‌ర‌గా తీసుకెళ్ల‌గా.. సమద్ ఏడు బంతుల్లో 17 పరుగులు చేసి విజయాన్ని అందించాడు. ఈ విజయంతో హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్ రేసులోకి వ‌చ్చింది. 10 మ్యాచ్‌ల ఆడిన‌ హైదరాబాద్‌కు ఎనిమిది పాయింట్లు ఉన్నాయి.

Updated On 7 May 2023 10:13 PM GMT
Yagnik

Yagnik

Next Story