ఐపీఎల్ 2023లో ఆదివారం జ‌రిగిన‌ 22వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mum,bai Indians) కోల్‌కతా నైట్ రైడర్స్‌(Kolkata Knight Riders)పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కుమారుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) తొలిసారి ఆడటం విశేషం. ఈ మ్యాచ్‌లో అర్జున్‌ తొలి ఓవర్‌ వేశాడు. ఐపీఎల్‌ అరంగేట్రం(IPL Debut) సందర్భంగా పలువురు ప్రముఖ క్రికెటర్లు అర్జున్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

ఐపీఎల్ 2023లో ఆదివారం జ‌రిగిన‌ 22వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mum,bai Indians) కోల్‌కతా నైట్ రైడర్స్‌(Kolkata Knight Riders)పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కుమారుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) తొలిసారి ఆడటం విశేషం. ఈ మ్యాచ్‌లో అర్జున్‌ తొలి ఓవర్‌ వేశాడు. ఐపీఎల్‌ అరంగేట్రం(IPL Debut) సందర్భంగా పలువురు ప్రముఖ క్రికెటర్లు అర్జున్‌కి శుభాకాంక్షలు తెలిపారు. అర్జున్ అరంగేట్రంపై సచిన్ స్వయంగా హృదయాన్ని హత్తుకునే నోట్‌ను రాశాడు.

స‌చిన్.. అర్జున్‌తో ఉన్న రెండు ఫోటోల‌ను సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేస్తూ.. అర్జున్.. ఈ రోజు నీవు క్రికెటర్‌గా నీ ప్రయాణంలో మరో ముఖ్యమైన అడుగు వేశావు. తండ్రిగా, క్రికెట్ ప్రేమికుడిగా ఎంతో ఆనందిస్తున్నాను. నీవు ఆట‌కు గౌర‌వం తీసుకొస్తావ‌ని తెలుసు. గేమ్ కూడా నీకు ప్రేమ‌ను అందిస్తుంద‌ని తెలుసు. ఇక్క‌డివ‌ర‌కూ రావ‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డ్డావు. అదే శ్ర‌మ‌ను ఇక‌పై కొన‌సాగించు.. అంటూ మ‌న‌సుకు హ‌త్తుకునేలా త‌న కొడుకుకు ట్విట‌ర్ ద్వారా సందేశాన్ని ఇచ్చాడు.

తన తండ్రి సచిన్ టెండూల్కర్ కూడా చాలా సంవత్సరాలు ముంబై జ‌ట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దీంతో ఒకే ఐపీఎల్‌ ఫ్రాంచైజీకి ఆడిన తండ్రికొడుకులుగా ఓ అరుదైన గుర్తింపు పొందారు. మ్యాచ్‌లో తొలి ఓవ‌ర్ వేసిన‌ అర్జున్ తన మొదటి ఓవర్‌లో ఐదు పరుగులు ఇచ్చాడు. అర్జున్ జగదీషన్‌(Jagadeeshan) ఎల్‌బీడబ్ల్యూ కోసం బిగ్గరగా అప్పీల్ చేశాడు. అయితే అంపైర్ దానిని తిరస్కరించాడు. ఈ మ్యాచ్‌లో అర్జున్ 2 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చాడు.

23 ఏళ్ల అర్జున్ గత కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్‌లో కొనసాగుతున్నాడు. అర్జున్‌ 2021లో వేలంలో ఎంపికయ్యాడు కానీ గాయం కారణంగా వైదొలగాల్సి వచ్చింది.2022 వేలంలో కూడా ఎంపికయ్యాడు కానీ గతేడాది అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. సుదీర్ఘ నిరీక్షణ ఆదివారంతో ముగిసింది.

Updated On 17 April 2023 1:34 AM GMT
Yagnik

Yagnik

Next Story