Royal Challengers Bengaluru vs Punjab Kings : ఆర్సీబీకి మొదటి విజయాన్ని కట్టబెట్టిన కోహ్లీ, కార్తీక్
ఐపీఎల్ 2024లో ఆరో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. టాస్ గెలిచిన ఆర్‌సీబీ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఐపీఎల్ 2024లో ఆరో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. టాస్ గెలిచిన ఆర్‌సీబీ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ధావన్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఆర్సీబీ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 77 పరుగులతో రాణించడంతో ఆర్సీబీ 19.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకోగా, పంజాబ్ ఐదో స్థానంలో ఉంది.
పంజాబ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ తొలి వికెట్‌కు 26 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. మూడో ఓవర్‌లో కగిసో రబాడ కెప్టెన్‌ని పెవిలియన్‌కు పంపాడు. ఫాఫ్ మూడు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కామెరాన్ గ్రీన్ కూడా మూడు పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. తర్వాత రజత్ పాటిదార్ 18 పరుగులు చేసి హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరుకున్నాడు.హర్‌ప్రీత్ బ్రార్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను కూడా అవుట్ చేశాడు.
16వ ఓవర్ చివరి బంతికి విరాట్ కోహ్లీ రూపంలో జట్టుకు ఐదో దెబ్బ తగిలింది. 130 పరుగుల స్కోరు వద్ద హర్షల్ పటేల్ బౌలింగ్‌లో హర్ ప్రీత్ చేతికి చిక్కాడు. కోహ్లీ 49 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు.
17వ ఓవర్ తర్వాత ఏడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన దినేష్ కార్తీక్, ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మహిపాల్ లోమ్రోర్ 48 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించింది.
20వ ఓవర్లో జట్టు విజయానికి 10 పరుగులు చేయాల్సి ఉంది. స్టార్ ఫినిషర్ దినేష్ కార్తీక్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో మొదటి బంతికి సిక్స్ కొట్టాడు. రెండవ బంతి వైడ్‌గా వెళ్లింది. అతను మూడవ బంతికి అద్భుతమైన ఫోర్ కొట్టి జట్టుకు మొదటి విజయాన్ని అందించాడు. పంజాబ్ తరఫున హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడా చెరో రెండు వికెట్లు తీయగా, శామ్ కుర్రాన్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు. పంజాబ్ జట్టులో ధావన్(45) టాప్ స్కోరర్ కావడం విశేషం.