RCB vs CSK : సీఎస్కేపై గెలుపు.. తొమ్మిదోసారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆర్సీబీ
ఐపీఎల్-2024 68వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. దీంతో ఫాఫ్ డుప్లెసిస్ జట్టు ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరిన నాలుగో జట్టుగా అవతరించింది.
ఐపీఎల్-2024 68వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. దీంతో ఫాఫ్ డుప్లెసిస్ జట్టు ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరిన నాలుగో జట్టుగా అవతరించింది. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ తొమ్మిదోసారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. అంతకుముందు కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. అదే సమయంలో ఈ ఓటమితో సీజన్‌లో సీఎస్‌కే(CSK) ప్రయాణం ముగిసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అనంతరం చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఆర్‌సీబీ ఖాతాలో ఇప్పుడు 14 పాయింట్లు ఉండగా.. నికర రన్ రేట్ +0.459. అదే సమయంలో కోల్‌కతా 19 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. రెండు, మూడు స్థానాల్లో రాజస్థాన్, హైదరాబాద్ జట్లు వరుసగా 16, 15 పాయింట్లతో ఉన్నాయి. రాజస్థాన్, హైదరాబాద్ జట్లు ఆదివారం లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ రెండు జట్లు మధ్య టాప్ టూ కోసం పోరు సాగనుంది.
19 ఓవర్ల తర్వాత RCB అర్హత సాధించడానికి 17 పరుగులు అవసరం కాగా.. మ్యాచ్ గెలవడానికి 35 పరుగులు అవసరం. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ యశ్ దయాల్‌పై విశ్వాసం ఉంచి ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అతనికి బంతిని అందించాడు. తొలి బంతికి ధోని ఫైన్‌లెగ్‌పై బలమైన షాట్ ఆడాడు. ఏకంగా 110 మీటర్ల సిక్సర్ కొట్టాడు. అలాగే.. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యేందుకు జట్టుకు ఐదు బంతుల్లో 11 పరుగులు అవసరం కాగా.. ఆ తర్వాతి బంతికే స్వప్నిల్ సింగ్ చేతికి చిక్కి ధోని క్యాచ్ ఔట్ అయ్యాడు. తర్వాత శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్‌కి వచ్చాడు. మూడో బంతికి పరుగు రాలేదు. ఆ తర్వాత జట్టుకు మూడు బంతుల్లో 11 పరుగులు కావాలి. నాలుగో బంతికి శార్దూల్ థర్డ్ మ్యాన్ వైపు షాట్ ఆడి పరుగు తీశాడు. దీంతో చెన్నైకి అర్హత సాధించేందుకు రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉంది. జడేజా క్రీజులోకి వచ్చాడు. చివరి రెండు బంతులు పరుగులేమీ చేయలేకపోయాడు. దీంతో ఈ సీజన్‌లో RCB వరుసగా ఆరో మ్యాచ్‌లో విజయం సాధించింది. అలాగే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.