Joe Root : కోహ్లీ రెండు కొడితే.. జో రూట్ ఏకంగా 18 కొట్టేశాడు!
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్(Joe Root) ట్రెమండస్ ఫామ్‌లో ఉన్నాడు.
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్(Joe Root) ట్రెమండస్ ఫామ్‌లో ఉన్నాడు. సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నాడు. మూడేళ్లలో జో రూట్ 18 సెంచరీలు చేశాడు. 16 హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తంగా 4600 రన్స్ సాధించాడు. 2021 నుంచి టెస్ట్‌ల్లో ఇన్నేసి సెంచరీలు కానీ, ఇన్నేసి పరుగులు కానీ చేసిన మొనగాడే లేడు. ఇప్పుడు క్రికెట్‌లో కొనసాగుతున్న కోహ్లి(Virat Kohli), విలియమ్సన్, స్టీవ్ స్మిత్ కూడా రూట్ చేసినన్ని సెంచరీలు చేయలేదు. అన్ని పరుగులు కూడా చేయలేకపోయారు. పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్ట్‌లో రూట్ సెంచరీ కొట్టి తన సెచరీల(Centuries) సంఖ్యను 35కు పెంచుకున్నాడు. 2021 మొదట్లో జో రూట్ సెంచరీలు కేవలం 17 మాత్రమే. అప్పుడు విరాట్ కోహ్లీ సెంచరీలు 27 ఉండేవి. అదే ఇప్పుడు కోహ్లీ సెంచరీల సంఖ్య 29గా ఉంటే, రూట్ సెంచరీల సంఖ్య 35కు చేరుకుంది. అంటే కోహ్లీ రెండు సెంచరీలు చేస్తే, రూట్ 18 సెంచరీలు చేశాడన్నమాట! అలాగని విలియమ్సన్, స్టీవ్ స్మిత్‌లు కూడా రూట్ అంత ఆడలేదు. 2021లో స్టీవ్ స్మిత్ సెంచరీలు 26గా ఉంటే ప్రస్తుతం అతని సెంచరీల సంఖ్య 32గా ఉంది. 2021లో విలియమ్సన్ సెంచరీల సంఖ్య 24గా ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 32గా ఉంది. కాకపోతే కోహ్లితో పోలిస్తే సెంచరీల విషయంలో విలియమ్సన్, స్టీవ్ స్మిత్ కొంచెం బెటర్!