IND vs WI 1st Test : తొలి రోజు టీమిండియాదే ఆధిపత్యం.. 150 పరుగులకే కుప్పకూలిన విండీస్
డొమినికా వేదికగా బుధవారం (జూలై 12) భారత్, వెస్టిండీస్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభమైంది. ఈ సిరీస్ ద్వారా టీమ్ ఇండియా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ఎడిషన్ తొలి మ్యాచ్ ఆడింది. అయితే తొలి టెస్టు తొలిరోజు వెస్టిండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ చేసింది భారత్. అంతేకాదు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా
డొమినికా(Dominica) వేదికగా బుధవారం (జూలై 12) భారత్(India), వెస్టిండీస్(Westindies) మధ్య రెండు టెస్టుల సిరీస్(Test Series) ప్రారంభమైంది. ఈ సిరీస్ ద్వారా టీమ్ ఇండియా(Teamindia).. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(World Test Championship) 2023-25 ఎడిషన్ తొలి మ్యాచ్ ఆడింది. అయితే తొలి టెస్టు తొలిరోజు వెస్టిండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ చేసింది భారత్. అంతేకాదు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా భారత్ 80 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో కలిసి ఇన్నింగ్సు ఆరంభించిన ఆరంగ్రేటం చేసిన యశస్వి జైస్వాల్(Yashaswi Jaishwal) అజేయంగా నిలిచాడు. అంతకుముందు బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఐదు వికెట్లు తీశాడు. తద్వారా టెస్టు క్రికెట్(test Cricket)లో 33వ సారి ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన రికార్డును సొంతం చేసుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు రోహిత్, యశస్వి శుభారంభం అందించారు. ఇద్దరూ అద్భుతమైన షాట్లు ఆడుతూ ఎలాంటి పొరపాటు చేయలేదు. యశస్వి 73 బంతుల్లో 40 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. యశస్వి తన ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు కొట్టాడు. రోహిత్ 65 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 30 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 70 పరుగుల వెనుకంజలో ఉన్న భారత్.. రెండో రోజు భారీ ఆధిక్యం సాధించేందుకు చూస్తోంది. మరోవైపు వెస్టిండీస్ బౌలర్లు మ్యాచ్‌ను తిప్పుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.
తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌కు మంచి ఆరంభం లభించలేదు. అంతేకాదు 76 పరుగులకే జట్టులో సగం మంది పెవిలియన్‌కు చేరుకున్నారు. వెస్టిండీస్‌ను రవిచంద్రన్ అశ్విన్ తొలి దెబ్బ కొట్టాడు. 13వ ఓవర్ ఐదో బంతికి తేజ్‌నారాయణ్ చందర్‌పాల్(Tej Narayan Chandrapaul)ను అవుట్ చేశాడు. 44 బంతుల్లో 12 పరుగులు చేసిన చందర్‌పాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్రాత్‌వైట్ క్యాచ్ అందుకున్నాడు. బ్రాత్‌వైట్ 46 బంతుల్లో 20 పరుగులు చేశాడు. అనంతరం శార్దూల్ ఠాకూర్ తన మొదటి ఓవర్లో రామన్ రీఫర్ వికెట్ తీశాడు. రీఫర్ 18 బంతుల్లో రెండు పరుగులు చేసి ఇషాన్ కిషన్(Ishan Kishan)కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అనంతరం రవీంద్ర జడేజా(Ravindra Jadeja) జెర్మైన్ బ్లాక్‌వుడ్ ను పెవిలియన్‌కు పంపాడు. బ్లాక్‌వుడ్(Balckwood) 34 బంతుల్లో 14 పరుగులు చేశాడు. లంచ్ సమయానికి వెస్టిండీస్ నాలుగు వికెట్లకు 68 పరుగులు చేసింది. లంచ్ తర్వాత విండీస్‌కు మరో దెబ్బ తగిలింది. జాషువా డి సిల్వాను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. 76 పరుగులకే ఐదు వికెట్లు పతనమైన తర్వాత.. అరంగేట్రం ఆటగాడు అలీక్ ఈతనాగే, వెటరన్ జాసన్ హోల్డర్ ఇన్నింగ్స్‌ను హ్యాండిల్ చేశారు. ఇద్దరూ జాగ్రత్తగా బ్యాటింగ్ చేసి ఆరో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం.
అయితే మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. జాసన్ హోల్డర్(Jason Holder) ఔట్ చేసి వీరి భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. 61 బంతుల్లో 18 పరుగులు చేసి హోల్డర్ ఔటయ్యాడు. అనంతరం అశ్విన్.. అథానెజ్ 99 బంతుల్లో 47 పరుగులు, అల్జారీ జోషప్ వికెట్లను పడగొట్టాడు. ఆ తర్వాత జడేజా కీమర్ రోచ్ వికెట్‌ను పడగొట్టాడు. చివరగా జడేజా వారికన్ వికెట్‌ను నేలకూల్చడంతో విండీస్ తొలి ఇన్నింగ్సు ముగిసింది.