మొహాలీ వేదికగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన‌ తొలి టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ(0) రనౌట్ కావడంతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

మొహాలీ వేదికగా భారత్, ఆఫ్ఘనిస్థాన్(India vs Afghanistan) మధ్య జరిగిన‌ తొలి టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)(0) రనౌట్ కావడంతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. హిట్‌మ్యాన్(Hit Man) 14 నెలల తర్వాత భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. రోహిత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జ‌ట్టు 158 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా భారత ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌లోనే రోహిత్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే ర‌నౌట్‌కు కార‌ణ‌మైన గిల్‌(Shubman Gill)పై రోహిత్ మైదానంలోనే త‌న ఆగ్ర‌హాన్ని వెళ్ల‌గ‌క్కాడు.

భారత ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికి రోహిత్ ముందుకెళ్లి మిడ్ ఆఫ్‌లో షాట్ ఆడి పరుగు కోసం ప్ర‌య‌త్నించాడు. మిడ్-ఆఫ్ వద్ద ఉన్న‌ జద్రాన్ బంతిని క్యాచ్ చేసి స్ట్రైకర్ ఎండ్‌కు విసిరే సమయానికి రోహిత్ నాన్-స్ట్రైకర్ ఎండ్‌కు చేరుకున్నాడు. అయితే నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న గిల్ మాత్రం క‌ద‌ల‌లేదు. దీంతో రోహిత్ రనౌట్ కావాల్సి వచ్చింది. ర‌నౌట్‌పై రోహిత్ అసంతృప్తిగా క‌నిపించాడు. కోపంతో శుభమన్‌పై విరుచుకుపడ్డాడు. గిల్ వైపు చూస్తూ ఆగ్ర‌హంతో సైగ‌లు చేస్తూ రోహిత్ పెవిలియన్ బాట పట్టాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రోహిత్ డేంజర్ ఎండ్‌లో పరుగెత్తుతున్నాడని.. కాబట్టి శుభ్‌మాన్ పరుగెత్తాలి. ఇది శుభ్‌మాన్ తప్పు అని అంటున్నారు.

అయితే రోహిత్ పెవిలియన్ కు చేరిన తర్వాత శుభ్ మన్ గిల్ కొన్ని మంచి షాట్లు ఆడినా నాలుగో ఓవర్ లోనే పెవిలియన్ బాట పట్టాడు. గిల్ 12 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 23 పరుగులు చేశాడు. ముజీబ్ ఉర్ రెహమాన్(Mujeeb Ur Rahman) బౌలింగ్‌లో వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్(Rahmanulla Gurbaz) చేతిలో స్టంపౌట్ అయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మహ్మద్ నబీ(Mohammad Nabi) 27 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. భారత్ తరఫున ముఖేష్ కుమార్(Mukesh Kumar), అక్షర్ పటేల్(Axar Patel) చెరో రెండు వికెట్లు తీశారు.

Updated On 11 Jan 2024 9:53 PM GMT
Yagnik

Yagnik

Next Story