Rohit Sharma : ధోనీ రికార్డును సమం చేసిన రోహిత్..!
భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో శనివారం జరిగింది.
భారత్, ఆఫ్ఘనిస్థాన్(India vs Afghanistan) జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ ఇండోర్(Indore)లోని హోల్కర్ స్టేడియంలో శనివారం జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 26 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. యశస్వి జైస్వాల్(Yashaswi Jaishwal), శివమ్ దూబే(Shivam Dube) భారత్ తరఫున తుఫాను ఇన్నింగ్సులు ఆడారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో రోహిత్ శర్మ(Rohit Sharma) ఎన్నో కీలక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా రోహిత్ శర్మ ఎంఎస్ ధోనీ(MS Dhoni) రికార్డును సమం చేశాడు. టీ20 మ్యాచ్‌ల విజయాల విషయంలో ఎంఎస్ ధోనీని రోహిత్ శర్మ సమం చేశాడు. కెప్టెన్‌గా రోహిత్ 41 టీ20 మ్యాచ్‌లలో విజయాలను అంధించాడు. రోహిత్ కెప్టెన్‌గా ఇప్పటి వరకూ 53 మ్యాచ్‌లలో 41 గెలవగా.. 12 మ్యాచ్‌లలో ఓటమిని చవిచూశాడు. MS ధోని భారత కెప్టెన్‌గా మొత్తం 72 T20 మ్యాచ్‌లలో 41 మ్యాచ్‌లలో విజయాలను అంధించాడు. మరో 28 మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ(Virat Kohli) 50 మ్యాచ్‌లలో 30 గెలిచి 16 ఓడాల్సి వచ్చింది. దీంతో కెప్టెన్‌గా అత్యధికంగా 12 టీ20 సిరీస్‌లు గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. అలాగే ప్రపంచ క్రికెట్‌లో అత్యధికంగా 150 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ 0 పరుగుల వద్ద ఔట్ అయ్యి పెవిలియన్‌కు చేరుకున్నాడు.