2025 ఛాంపియన్స్​ ట్రోఫీలో భారత్‌ శుభారంభం చేసింది. బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో భారత్ 6 వికెట్ల తేడాతో గెల్చింది.

2025 ఛాంపియన్స్​ ట్రోఫీలో భారత్‌ శుభారంభం చేసింది. బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో భారత్ 6 వికెట్ల తేడాతో గెల్చింది. మ్యాచ్‌ గెలిచిన సంతోషం కంటే ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ (AxarPatel)బాధ చెప్పుకోలేనిది. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌ చేస్తుండగా అక్షర్ 9వ ఓవర్​ బౌలింగ్​కు దిగాడు. ఆ ఓవర్​లో రెండు, మూడు వరుస బంతుల్లో తంజీద్ హసన్ (25 పరుగులు), ముష్ఫికర్ రహీమ్ (0)ను ఔట్ చేశాడు. దీంతో అక్షర్ హ్యాట్రిక్​కు చేరువయ్యాడు. తర్వాతి బంతికి, అప్పుడే క్రీజులోకి వచ్చిన జేకర్ అలీ కూడా ఔట్ అయ్యేవాడే. ఔట్‌ సైడ్‌ ఎడ్జ్‌తో చేతుల్లోకి వచ్చిన సింపుల్​ క్యాచ్​ను రోహిత్‌ జారవిడిచాడు. లడ్డూ లాంటి క్యాచ్‌ను పట్టలేకపోయినందుకు అతడు తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కాడు. వెంటనే హ్యాట్రిక్‌ను మిస్ చేసినందుకు అక్షర్‌కు సారీ చెప్పాడు. అప్పటికి బంగ్లా స్కోర్ 35-5గా ఉన్నది. దీంతో అక్షర్​ ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో హ్యాట్రిక్ నమోదు చేసే సువర్ణావకాశం కోల్పోయాడు. దీనిపై మ్యాచ్‌ ముగిసిన తర్వాత రోహిత్‌ స్పందిస్తూ.. అంత ఈజీ క్యాచ్‌ను వదిలేసి ఉండాల్సి కాదన్నాడు. లడ్డూ లాంటి క్యాచ్‌ను మిస్‌ చేసినందుకు అక్షర్‌ను డిన్నర్‌కు తీసుకెళ్తానన్నాడు. అంతటి ఈజీ క్యాచ్ పట్టి ఉండాల్సిందని అన్నాడు. లడ్డూ లాంటి క్యాచ్ మిస్ చేసినందుకు అక్షర్​ను డిన్నర్​కు తీసుకెళ్లాలని సరదగా అన్నాడు. 'అది చాలా ఈజీ క్యాచ్. నేను ఆ క్యాచ్ పట్టాల్సింది. కానీ, స్లిప్స్​లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఇలాంటివి జరుగుతాయి. అయితే క్యాచ్ మిస్ చేసినందుకు నేను రేపు అతడిని డిన్నర్​కు తీసుకెళ్తా' అని రోహిత్ పేర్కొన్నాడు.

ehatv

ehatv

Next Story