Rohit Sharma : 718 రోజుల తర్వాత హాఫ్ సెంచరీ చేసిన రోహిత్.. అయినా ఓ రికార్డ్ సాధించాడు.!
ఐపీఎల్-2023 16వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)ను ఓడించింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి ఇదే తొలి విజయం. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన ముంబై విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు ధీటుగా సమాధానమిచ్చాడు. ఢిల్లీపై రోహిత్ 45 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్ ద్వారా […]
ఐపీఎల్-2023 16వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)ను ఓడించింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి ఇదే తొలి విజయం. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన ముంబై విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు ధీటుగా సమాధానమిచ్చాడు. ఢిల్లీపై రోహిత్ 45 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ తన ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు. అలాగే.. ఓ అరుదైన ఫీట్‌ను కూడా సాధించాడు.
ఐపీఎల్‌లో రోహిత్‌కి ఇది 26వ అర్ధ సెంచరీ. ఐపీఎల్ అర్ధసెంచరీలలో రోహిత్ ఏబీ డివిలియర్స్(AB de Villiers)ను దాటాడు. ఏబీ డివిలియర్స్ 25 అర్ధ సెంచరీలతో మూడో స్థానంలో ఉండగా.. రోహిత్ నిన్న దాటేశాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్(David Warner) 36 అర్ధ సెంచరీలతో మొదటి స్థానంలో, శిఖర్ ధావన్(Shikhar Dhawan) 33 అర్ధ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. వారిద్దరి తర్వాత రోహిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు.
ముంబై ఇండియన్స్ అభిమానులు ఎంతో కాలంగా రోహిత్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. 718 రోజుల తర్వాత ఐపీఎల్‌లో రోహిత్ హాఫ్ సెంచరీ సాధించాడు. గత సీజన్‌లో రోహిత్ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. రోహిత్ 23 ఏప్రిల్ 2021న పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై తన చివరి అర్ధ సెంచరీని సాధించాడు. ఈ సీజన్‌లో ముంబై పునరాగమనం చేయాలంటే రోహిత్ బ్యాటింగ్ మెరుపులు అవసరం. కాబట్టి రోహిత్ ఇదే ఫామ్‌ను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 19.2 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది ముంబై జట్టు.