కోల్‌కతా నైట్ రైడర్స్ ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ విజయంతో కోల్‌కతా 11 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కోల్‌కతా ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని కోల్‌కతా ఐదు వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజ‌యం సాధించింది.

కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)ను ఓడించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ విజయంతో కోల్‌కతా(Kolkata) 11 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్(Punjab) కింగ్స్ కోల్‌కతా ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని కోల్‌కతా ఐదు వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజ‌యం సాధించింది.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్‌ జట్టు ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్(Rahmanullah Gurbaz) కేవ‌లం 15 పరుగులు మాత్ర‌మే చేశాడు. జాసన్ రాయ్(Jason Roy) వేగంగా 31 పరుగులు చేసి పెవిలియ‌న్ చేరాడు. కెప్టెన్ నితీశ్ రాణా(Nitish Rana) 51 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆండ్రీ రస్సెల్(Andre Russell) (42) ప‌రుగుల‌తో మెప్పించాడు. 10 బంతుల్లో 21 పరుగులు చేసిన రింకూ సింగ్(Rinku Singh).. చివ‌రి బంతికి ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించి హీరో అయ్యాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్(Punjab) ఏడు వికెట్లకు 179 పరుగులు చేసింది. పంజాబ్ తరఫున కెప్టెన్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) అత్యధికంగా 57 పరుగులు చేశాడు. మిగ‌తా బ్యాట్స్‌మెన్ ఎవ‌రూ చెప్పుకోద‌గ్గ స్కోరు చేయ‌లేదు. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) మూడు వికెట్లు, హర్షిత్ రాణా(Harshith Rana) రెండు వికెట్లు తీశారు. కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) తరఫున నితీష్ రాణా 51, ఆండ్రీ రస్సెల్ 42 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్(Rahul Chahar) రెండు వికెట్లు తీశాడు.

Updated On 8 May 2023 8:51 PM GMT
Yagnik

Yagnik

Next Story