ఆస్ట్రేలియా గ్రేట్ రికీ పాంటింగ్ ను భారత ప్రధాన కోచ్ పదవి కోసం బీసీసీఐ

ఆస్ట్రేలియా గ్రేట్ రికీ పాంటింగ్ ను భారత ప్రధాన కోచ్ పదవి కోసం బీసీసీఐ తనను సంప్రదించినట్లు వెల్లడించాడు. అయితే ప్రస్తుతం తన "జీవన శైలి"కి ఈ బాధ్యతలు సరిపోకపోవడంతో ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ IPL ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్‌గా ఇటీవలే ఏడు సీజన్‌లను పూర్తి చేసిన పాంటింగ్, గతంలో ఆస్ట్రేలియా తాత్కాలిక T20 కోచ్‌గా ఉన్నారు. IPL సమయంలో భారత హెడ్ కోచ్ బాధ్యతలకు సంబంధించి చిన్నపాటి సంభాషణలు జరిగాయి.. నేను చేస్తానా లేదా అనే దానిపై చర్చలు జరిపారని పాంటింగ్ ICCకి చెప్పాడు.

నేను జాతీయ జట్టుకు సీనియర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలని అనుకుంటూ ఉన్నాను.. కానీ నా జీవితంలో ప్రస్తుతం ఇతర విషయాలతో పాటు ఇంట్లో కొంచెం సమయం గడపాలని కోరుకుంటున్నానని వివరించాడు. భారత జట్టుతో కలిసి పని చేస్తే.. IPL జట్టులో పాల్గొనలేనన్నాడు. జాతీయ ప్రధాన కోచ్ అనేది సంవత్సరంలో 10 లేదా 11 నెలల ఉద్యోగం.. ఇది ప్రస్తుతం నా జీవనశైలికి, నేను నిజంగా ఆనందించే పనులకు సరిపోదని తెలిపాడు.

Updated On 22 May 2024 11:55 PM GMT
Yagnik

Yagnik

Next Story