VVS Lakshman : కంగారులనే కంగారు పెట్టించిన క్రికెటర్..! హ్యాపీ బర్త్ డే లక్ష్మణ్..!
వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman).. వంగి వరపు వెంకటసాయి లక్ష్మణ్.
వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman).. వంగి వరపు వెంకటసాయి లక్ష్మణ్. భారత జట్టుకు ఎంపికైన తెలుగు క్రీడాకారుల్లో లక్ష్మణ్ ఒకడు. విలక్షణమైన బ్యాటింగ్ శైలి, తన మణికట్టుతో చూడ చక్కని షాట్స్ ఆటతో ఆకట్టుకునేవాడు. మణికట్టు మాయజాలంతో తను ఆడే షాట్స్ టెండూల్కర్‌తో(Tendulkar) పోల్చవచ్చు. కొన్ని కొన్ని సార్లు టెండూల్కర్ కంటే మెరుగైన షాట్స్ ఆడేవాడు. ఒకే బంతిని ఇరువైపులా కొట్టగల అరుదైన ప్రతిభ కలిగిన ప్లేయర్‌గా నిలిచాడు. ప్రపంచంలో తమకు ఎదురే లేదనుకున్న ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించేవాడు. కంగారులను సైతం కంగారుపెట్టేవాడు. 2003-04లో జరిగిన కోల్‌కతా టెస్టులో 281 పరుగులతో భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. తాను చేసిన 23 సెంచరీల్లో ఏకంగా ఆస్ట్రేలియాపై 10 సెంచరీలు చేశాడు. భారత్ తరపున 134 టెస్టులు ఆడిన లక్ష్మణ్ 8,781 పరుగులు చేశాడు. లక్ష్మణ్ తన చివరి సీజన్‌లో ఫామ్‌లో కోల్పోయాడు. 2011/12లో - ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో భారత్ ఓటమి చెందింది. అతను న్యూజిలాండ్‌తో తదుపరి స్వదేశీ టెస్టుల కోసం జట్టులో ఎంపికయ్యాడు, కానీ ఆశ్చర్యకరంగా అతని సొంత నగరమైన హైదరాబాద్‌లో మొదటి టెస్ట్ ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మెంటార్‌గా ఉండడమే కాకుండా టీవీ వ్యాఖ్యాతగా మారాడు. భారత ప్రభుత్వం 2011లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. హ్యాపీ బర్త్ డే లక్ష్మణ్