ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్ జట్టు 4 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్ జట్టు 4 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్‌ పటిదార్‌ (34), విరాట్‌ కోహ్లి (33), మహిపాల్‌ లోమ్రోర్‌ ( 32) పరుగులతో రాణించారు. అనంతరం రాజస్తాన్‌ 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసి క్వాలిఫయర్ కు అర్హత సాధించింది. యశస్వి జైస్వాల్‌ (30 బంతుల్లో 45; 8 ఫోర్లు), రియాన్‌ పరాగ్‌ (26 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాయల్స్ కు విజయాన్ని అందించారు. అశ్విన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్ పటీదార్ (34), విరాట్ కోహ్లీ (33), లామ్రోర్ (32) పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లలో డుప్లెసిస్ (17), మ్యాక్స్‌వెల్ (0), దినేశ్ కార్తీక్ (11), స్వప్నిల్ సింగ్ (9 నాటౌట్), కర్ణ్ శర్మ (5) చొప్పున పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3 వికెట్లు, అశ్విన్-2, బౌల్ట్, సందీప్ శర్మ, చాహల్ తలో వికెట్ తీశారు.

Updated On 22 May 2024 9:05 PM GMT
Yagnik

Yagnik

Next Story