టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి టైటిల్ ను గెలుచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ వచ్చిన 16 ఏళ్లకు ఒక ట్రోఫీ సాధించింది. మార్చి 17, ఆదివారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన WPL ఫైనల్ లో ట్రోఫీని కైవసం చేసుకోడానికి RCB.. ఎనిమిది వికెట్ల తేడాతో DCని ఓడించింది. 114 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ సునాయాసంగా ఛేదించింది. RCB స్పిన్-అటాక్ మొట్టమొదటి ట్రోఫీని అందుకోవడంలో సహాయపడింది.

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. శ్రేయాంక పాటిల్ సూపర్ స్పెల్ తో అదరగొట్టింది. శ్రేయాంక 3.3 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. సోఫీ మోలినాక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లతో సత్తా చాటారు. ఢిల్లీ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు కెప్టెన్ మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ తొలి వికెట్ కు 7.1 ఓవర్లలో 64 పరుగులు జోడించి శుభారంభం అందించారు. కానీ షెఫాలీ అవుటయ్యాక ఢిల్లీ జట్టు 49 పరుగుల వ్యవధిలో 10 వికెట్లను చేజార్చుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ముగ్గురు డకౌట్ అయ్యారు. ఆర్సీబీ జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. 114 పరుగుల విజయలక్ష్యాన్ని బెంగళూరు జట్టు 19.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్సీబీ ఛేజింగ్ లో టాపార్డర్ రాణించింది. ఓపెనర్లు కెప్టెన్ స్మృతి మంధన 31, సోఫీ డివైన్ 32, ఎలిస్ పెర్రీ 35 (నాటౌట్), రిచా ఘోష్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే 1, మిను మణి 1 వికెట్ తీశారు.

Updated On 17 March 2024 8:33 PM GMT
Yagnik

Yagnik

Next Story