England Vs New Zealand ODI WC 2023 : ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్
ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
ప్రపంచకప్(world Cup) తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్(Newzealand) తొమ్మిది వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్(England)ను ఓడించింది. అహ్మదాబాద్(Ahmadabad)లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendramodi Stadium)లో జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 282 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టులో బెయిర్ స్టో(33), జోరూట్(77), జాస్ బట్లర్(43) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ మూడు, శాంట్నర్ రెండు, ఫిలిప్స్ రెండు వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 283 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ విజయంతో కివీస్ జట్టు 2019 ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 283 పరుగులు చేసి విజయం సాధించింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జిలాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వాయ్(Devon Conway), రచిన్ రవీంద్ర(Rachin Ravindra) అద్భుతంగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 273 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాన్వాయ్ 121 బంతుల్లో అజేయంగా 152 పరుగులు చేశాడు. రచిన్ 96 బంతుల్లో 123 పరుగులు చేశాడు. కాన్వే తన ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. కాగా, రచిన్ 11 ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు. వీరిద్దరి దూకుడు బ్యాటింగ్ ముందు ఇంగ్లండ్ బౌలర్లు నిస్సహాయంగా కనిపించారు. ఇంగ్లండ్ తరఫున శామ్ కర్రన్(Sam Curran) ఒక్క వికెట్ తీశాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా రచిన్ ఎంపికయ్యాడు.