దాదాపు 48 గంటలపాటు అశ్విన్ తీరికలేని ప్రయాణంపై అతడి భార్య ప్రీతి నారాయణన్

రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్‌లో చారిత్రాత్మకమైన 500వ వికెట్ మైలురాయిని అందుకున్నాడు. అశ్విన్ తల్లి తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో అశ్విన్ మ్యాచ్ మధ్యలోనే హుటాహుటిన బయలుదేరి ఇంటికి వెళ్లిపోయాడు. మ్యాచ్ రెండవ రోజున ఇంటికెళ్లి అమ్మను పరామర్శించి తిరుగుపయనమయ్యాడు. మ్యాచ్‌ నాలుగవ రోజున టీమ్‌తో కలిశాడు. ఆ ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీసి 501వ వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు.

దాదాపు 48 గంటలపాటు అశ్విన్ తీరికలేని ప్రయాణంపై అతడి భార్య ప్రీతి నారాయణన్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. ‘‘500వ వికెట్ కోసం మేము హైదరాబాద్‌ టెస్టులో ప్రయత్నించాము. అది జరగలేదు. వైజాగ్‌ టెస్టులోనూ సాధ్యపడలేదు. కాబట్టి అప్పటికే కొని ఉంచిన స్వీట్లను 499వ వికెట్ వద్దే ఇంటి దగ్గర అందరికీ పంపిపెట్టాను. 500వ వికెట్ దక్కింది కానీ మేము నిశ్శబ్దంగా ఉండిపోయాం. 500 - 501 వికెట్ల మధ్య చాలా జరిగాయి. మా జీవితంలో అత్యంత సుదీర్ఘంగా గడిచిన 48 గంటలు ఇవి. నేను చెప్పేదంతా 500వ వికెట్, అంతకుముందు ప్రదర్శన గురించే. నిజంగా ఎంత అసాధారణమైన వ్యక్తి. అశ్విన్ మీ పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. మేము నిన్ను అభిమానిస్తున్నాము!’’ అంటూ ప్రీతి నారాయణన్ వ్యాఖ్యానించారు.

Updated On 18 Feb 2024 10:59 PM GMT
Yagnik

Yagnik

Next Story