ఇండోర్‌లో జరిగిన రెండో వన్డేలో డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించి..

ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న‌ మూడు వన్డేల సిరీస్‌ను భారత్(India) కైవసం చేసుకుంది. ఇండోర్‌(Indore)లో జరిగిన రెండో వన్డేలో డక్‌వర్త్ లూయిస్(Duckworth Lewis) నిబంధనల ప్రకారం.. 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించి.. ఇంకో మ్యాచ్ మిగిలుండ‌గానే సిరీస్‌ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ నియమావళి ప్రకారం.. ఆస్ట్రేలియాకు 33 ఓవర్లలో 317 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో కంగారూ జట్టు 28.2 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది.

ఆస్ట్రేలియా తరఫున సీన్ అబాట్ (54), డేవిడ్ వార్నర్ (53) పరుగులు చేశారు. మార్నస్ లాబుషాగ్నే (27) పరుగులు, జోష్ హేజిల్‌వుడ్ (23), కామెరాన్ గ్రీన్ (19) పరుగులు, అలెక్స్ కారీ (14) పరుగులు చేశారు. మాథ్యూ షార్ట్ తొమ్మిది(9), జోష్ ఇంగ్లీష్(6), ఆడమ్ జంపా(5) ప‌రుగులు చేసి అవుటయ్యారు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఖాతా తెరవలేకపోయాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా భారత్‌కు కిల్లర్‌ బౌలింగ్‌ చేశారు. ఇద్దరూ చెరో మూడు వికెట్లు తీశారు. ప్రసిధ్ కృష్ణకు రెండు వికెట్లు, మహ్మద్ షమీకి ఒక వికెట్ లభించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టులో రుతురాజ్ గైక్వాడ్(8) త్వ‌ర‌గానే అవుట‌వ‌గా.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌(105), శుభ్‌మ‌న్ గిల్(104) లు సెంచ‌రీలు చేశారు. కేఎల్ రాహుల్‌(52), ఇషాన్ కిష‌న్‌(31), సూర్య కుమార్ యాద‌వ్‌(72) పరుగులు చేశారు. శ్రేయ‌స్ అయ్య‌ర్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వ‌రించింది.

Updated On 24 Sep 2023 8:50 PM GMT
Yagnik

Yagnik

Next Story