భారత జట్టు(TeamIndia) అనుభవజ్ఞుడైన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) రింకూ సింగ్‌(Rinku Singh)ను 'లెప్ట్‌హ్యాండ్‌ ధోనీ'(Lefthand Dhoni)గా అభివర్ణించాడు.

భారత జట్టు(TeamIndia) అనుభవజ్ఞుడైన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) రింకూ సింగ్‌(Rinku Singh)ను 'లెప్ట్‌హ్యాండ్‌ ధోనీ'(Lefthand Dhoni)గా అభివర్ణించాడు. రింకు సింగ్ ఇటీవల బెంగళూరు(Bengaluru)లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో, చివరి T20 మ్యాచ్‌లో 69* పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

ధోనీ(Dhoni), రింకూ మధ్య ఎలాంటి పోలిక లేదని.. అయితే తన ప్రశాంతమైన ఆలోచనతో రింకు ఆకట్టుకున్నాడు. ఇది MS ధోనీలో కూడా చూశామ‌ని అశ్విన్ అన్నాడు. రింకు సింగ్ IPL 2023లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత భారత T20 జట్టులో చోటు సంపాదించాడు. తక్షణమే అతను మంచి ఫినిషర్(Finisher) పాత్ర పోషిస్తున్నాడు.

నేను ఎడమచేతి వాటం ధోని అని పిలవాలనుకునే వ్యక్తి రింకూ సింగ్. నేను ప్రస్తుతం అతనిని ధోనీతో పోల్చడం లేదు. ఎందుకంటే ధోనీ చాలా ఎత్తు ఉన్న ఆటగాడు. కానీ రింకూ సింగ్ ప్రశాంత స్వభావం గురించి నేను మాట్లాడుతున్నాను. రింకు ఉత్తరప్రదేశ్(Uttarpradesh) తరపున అధ్భుతంగా రాణించి భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రింకూ సింగ్ చాలా సంవత్సరాలు KKR బెంచ్‌పై కూర్చున్నాడు. అతడు కేకేఆర్‌(KKR)లో ఉన్నప్పుడు ప్రాక్టీస్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం లేకపోయినప్పుడు.. సీనియ‌ర్‌ బ్యాట్స్‌మెన్ త్రోడౌన్‌లకు ఉపయోగించే బంతులను సేకరించి బౌలర్‌కు ఇచ్చేవాడని చాలామంది నాతో చెప్పేవారని అశ్విన్ గుర్తుచేశాడు.

2023లో ఐర్లాండ్‌(Ireland)పై అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసిన రింకూ సింగ్ 89 సగటుతో 176.23 స్ట్రైక్ రేట్‌తో 356 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. జిక్‌బర్హాలో దక్షిణాఫ్రికాపై రింకు సింగ్ 39 బంతుల్లో 68* పరుగులు, ఆపై ఆఫ్ఘనిస్తాన్‌పై 69* పరుగులు చేశాడు.

Updated On 19 Jan 2024 11:11 PM GMT
Yagnik

Yagnik

Next Story