CSK vs RR : ధోనీ చివరి వరకు క్రీజులో ఉన్నా ఓటమి పాలైన సీఎస్‌కే.. రాజస్థాన్‌కు మూడో విజయం
ఐపీఎల్-2023లో ఉత్కంఠభరితంగా సాగిన 17వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టు 3 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. 176 పరుగుల ఛేదనకు దిగిన సీఎస్‌కే జట్టులో స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కేవలం 8 […]
ఐపీఎల్-2023లో ఉత్కంఠభరితంగా సాగిన 17వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టు 3 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.
176 పరుగుల ఛేదనకు దిగిన సీఎస్‌కే జట్టులో స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కేవలం 8 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం డెవాన్ కాన్వే (50), అజింక్యా రహానే (31) భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాత మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శివమ్ దూబే(Shivam Dube), మొయిన్ అలీ(Moeen Ali), అంబటి రాయుడులు విఫలమయ్యారు. దీంతో మ్యాచ్ మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా(Ravindra Jadeja)ల భుజస్కంధాలపై పడింది. చివరి 2 ఓవర్లలో విజయానికి 40 పరుగులు కావాలి. జాసన్ హోల్డర్(Jason Holder) వేసిన ఓవర్లో ధోనీ, జడేజా జోడీ 19 పరుగులు చేసింది. సందీప్ శర్మ(Sandeep Sharma) చివరి ఓవర్ బౌలింగ్ బాధ్యతను అందుకున్నాడు. రెండో, మూడో బంతులను సిక్స్‌లుగా మలచడంతో మ్యాచ్ సీఎస్‌కే చేతుల్లోకి వచ్చింది. అయితే చివర్లో సందీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విజయం రాజస్థాన్‌ను వరించింది. ధోనీ 17 బంతుల్లో 32, జడేజా 15 బంతుల్లో 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
తొలుత రాజస్థాన్ ఇన్నింగ్సును దూకుడుగా ప్రారంభించింది. పవర్‌ప్లేలో వరుసగా నాలుగోసారి జట్టు 50కి పైగా పరుగులు చేసింది. అయితే ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 10 పరుగులు చేసి ఔటయ్యాడు. జోస్ బట్లర్ 38 బంతుల్లో 52 పరుగులతో రాణించాడు. బట్లర్.. దేవదత్ పడిక్కల్ తో రెండో వికెట్‌కు 77 పరుగులు బాగస్వామ్యం నెలకొల్పాడు. రవీంద్ర జడేజా మొదట పడిక్కల్‌ను, ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్‌ను ఔట్ చేయడంతో రాజస్థాన్ ఇన్నింగ్సు కాస్తా నెమ్మదిగా సాగింది. జడేజా నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. తుషార్ దేశ్‌పాండే(Thushardesh Pandey), ఆకాష్ సింగ్(Akash Singh) తలా రెండు వికెట్లు తీసుకున్నారు. మొయిన్ అలీ ఒక వికెట్ పడగొట్టాడు.
రెండు జట్లలో ఆటగాళ్లు :
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (c & wk), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
CSK: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోని (కెప్టెన్/వికెట్ కీపర్), సిసంద మగల, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సింగ్