Rajasthan Beat CSK : చేజింగ్‌లో చతికిలపడ్డ చెన్నై.. సీఎస్‌కేపై రాజస్థాన్ రాయల్స్ భారీ విజయం
ఐపీఎల్-2023లో భాగంగా జరిగిన 37వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గురువారం రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 32 పరుగుల తేడాతో సీఎస్‌కేపై విజయం సాధించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 202 పరుగులకు ఆలౌటైంది. దీనికి సమాధానంగా సీఎస్‌కే 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఐపీఎల్-2023లో భాగంగా జరిగిన 37వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) గురువారం రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్(Rajasthan) 32 పరుగుల తేడాతో సీఎస్‌కే(ASK)పై విజయం సాధించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 202 పరుగులకు ఆలౌటైంది. దీనికి సమాధానంగా సీఎస్‌కే 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సీఎస్‌కే ఓపెనర్ డెవాన్ కాన్వే(Devon Conway) కేవలం 8 పరుగులకే ఔటయ్యాడు. గత కొన్ని ఇన్నింగ్స్‌లుగా అద్భుత ప్రదర్శన చేస్తున్న అజింక్యా రహానే(Ajinkya Rahane) కూడా 15 పరుగులే చేయగలిగాడు. రుతురాజ్ గైక్వాడ్(Ruthuraj Gaikwad) 42 పరుగులతో పర్వాలేదనిపించాడు. శివమ్ దూబే(Shiva Dubey) 33 బంతుల్లో 52 పరుగులు అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రవీంద్ర జడేజా(23), మొయిన్ అలీ(23) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ఆడమ్ జంపా(Adam Zampa) మూడు, అశ్విన్(Ashwin) రెండు, కుల్‌దీప్ యాదవ్(Kuldeep Yadav) ఒక వికెట్ పడగొట్టారు.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. రాజస్థాన్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashaswi Jaiswal) 77 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జోస్ బట్లర్(Jos Buttlet) 27, కెప్టెన్ సంజూ శాంసన్ 17 పరుగులు చేశారు. చివర్లో ధ్రువ్ జురెల్ 15 బంతుల్లో 35, దేవదత్ పడిక్కల్ 27 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే రెండు, తీక్షణ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. అద్భుత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలోకి వెళ్లింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో రాజస్థాన్ ఐదు విజయాలు సాధించింది.