Rahul Dravid : కేకేఆర్ మెంటర్‌గా ద్రవిడ్.. భారీ ఆఫర్ అంటున్నారే..!
ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఈ సీజన్‌లో గౌతమ్ గంభీర్ జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు
ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఈ సీజన్‌లో గౌతమ్ గంభీర్ జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు. అతడు KKRకి మెంటర్‌గా తిరిగిరాగానే మూడవసారి జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. KKR గతంలో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో రెండుసార్లు IPL టైటిల్‌ను గెలుచుకుంది. మూడవసారి గంభీర్ జట్టుకు మెంటార్‌గా ఉండటంతో టైటిల్‌ను గెలుచుకుంది. రాహుల్ ద్రవిడ్ టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ఈ సమయంలో గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అవుతాడని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. టీమిండియా కోచ్ పదవి నుంచి తప్పుకున్న రాహుల్ ద్రవిడ్‌ను కేకేఆర్ జట్టుకు మెంటార్‌గా ఉండమనే ఆఫర్ మందుంచినట్లు టాక్ నడుస్తుంది.
భారత జట్టు T20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం కూడా ముగిసింది. రాహుల్ ద్రవిడ్ పదవీకాలానికి చివరి రోజు జూన్ 29. గత సంవత్సరం ఆస్ట్రేలియాతో జరిగిన WTC ఫైనల్, ODI ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓడిపోయిన తర్వాత భారత జట్టు.. రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో T20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది.
భారత్ ఛాంపియన్‌గా మారిన అనంతరం ద్రావిడ్‌కు కోచింగ్ నుంచి తప్పుకుని.. ఖాళీగా ఉండనున్నాడు. అయితే.. గంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా వెళ్లనున్న నేపథ్యంలో.. కేకేఆర్ KKR భారీ ఆఫర్ ఇచ్చి ద్రవిడ్‌ను మెంటర్‌గా తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కోచ్‌గా రూ.12 కోట్లు సంపాదించిన ద్రవిడ్‌కు ఇంకా ఎక్కువ మొత్తం ఆఫర్ చేసినట్లుగా కూడా నివేదికలు చెబుతున్నాయి.
అంతకుముందు కింగ్‌స్టన్ ఓవల్‌లో ద్రవిడ్ మాట్లాడుతూ.. తాను వచ్చే వారం నుండి నిరుద్యోగిగా ఉండబోతున్నానని సరదాగా చెప్పాడు. అయితే..ద్రావిడ్ ఇప్పుడు మరో ఉద్యోగం కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే అతడిని మెంటర్‌గా తీసుకోవడానికి KKR యాజమాన్యం సంప్రదించిందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై క్లీరిటీ రావాల్సివుంది.